News


మరోసారి 1600డాలర్ల వైపు పసిడి

Saturday 25th January 2020
Markets_main1579941251.png-31201

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర తొందర్లో మరోసారి 1600డాలర్లస్థాయిని అందుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్‌ సంక్షోభ సమయంలో ఒక్క ఉదుటన 1600 డాలర్లపైకి ఎగిసి, అటుతర్వాత క్రమేపీ 1,550 డాలర్లస్థాయికి పసిడి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ఆందోళనతో గత రెండు రోజుల నుంచి పసిడి పెరుగుతూ వస్తోంది. ఇక వచ్చే వారంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యపరపతి సమావేశాలు, చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి భయాలు ఇన్వెస్టర్లను పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపేలా పురిగోల్పుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర...అదేరోజు ఉదయం ఆసియా ట్రేడింగ్‌తో పోలిస్తే 11 డాలర్లు పెరిగి 1,571.10డాలర్ల వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద 0.7శాతం లాభపడింది. వచ్చేవారంలో ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం వడ్డీరేట్ల తన వైఖరిని ప్రకటించనుంది. కరోనా వైరస్ యొక్క వ్యాప్తి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తెరపైకి వచ్చే అంశాలను విశ్లేషకులు నిచితంగా పరిశీలిస్తున్నారు.

ఫెడ్‌ వడ్డీరేట్ల ప్రభావం: 

వచ్చేవారంలో యూఎస్‌ ఫెడ్‌సమావేశాలఅనంతరం ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ మీడియా సమావేశం పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలు వెలువడాల్సి ఉంది. గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ... ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను యథాతధంగా ఉంచవచ్చని మార్కెట్‌ వర్గాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతధంగా ఉంచినప్పటికీ.., ఈ ఏడాదిలో కోత తప్పక ఉంటుంది. ఇది పసిడి ధరకు మద్దతునిస్తాయని  టీడీ సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ ఘాలి తెలిపారు. 

కరోనా వైరస్‌ ప్రభావం:- 
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది.  ఈ వైరస్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 15 మంది చనిపోవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ వైరస్‌ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చికాగోలో శుక్రవారం కరోనా వైరస్ రెండో కేసును నమోదు చేసినట్లు యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వ్యాధి వ్యాప్తి తీవ్రత అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ముందస్తు చర్యల్లో భాగంగా రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే పసిడిపై వైరస్‌ ప్రభావం తాత్కలికమేనని బులియన్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వారం లిబియా, ఇరాక్‌లోని సంఘటనలపై చమురు ధరలు ఎలాంటి ఒడిదుడుకులు లోనవలేదు ఇలాంటి సంఘటనలు పసిడి ధరకు సానుకూలంగా ఉంటాయి. అలాగే వచ్చే వారంలో లునార్‌సెలవులు సందర్భంగా చైనా మార్కెట్లు పనిచేయవు. పసిడి ర్యాలీకి కలిసొచ్చే అంశాల్లో ఇది ఒకటి.

పసిడికి కీలకమైన స్థాయిలు:- 
 స్వల్పకాలానికి పసిడి ధర బుల్లిష్‌గానే ఉంటుందని 1,550-1,570డాలర్ల శ్రేణి కీలకం అని పసిడి విశ్లేషకులు ఓ కన్నెల్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.You may be interested

ఆధార్‌ లేదా పాన్‌ ఇవ్వకుంటే..టీడీఎస్‌ 20 శాతం -ఐటీ శాఖ

Saturday 25th January 2020

ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా పాన్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ను ఆదాయ పన్ను శాఖకు తెలియజేయవలసి ఉంటుంది. లేదంటే వేతనం పొం‍దే సంస్థ వద్ద విధించే పన్ను(టీడీఎస్‌) 20 శాతం చెల్లించవలసి ఉంటుంది.  ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇకపై ఉద్యోగులు పాన్‌ నంబర్‌ లేనిపక్షంలో కనీసం ఆధార్‌ సంఖ్యనైనా వెల్లడించవలసి ఉంటుంది. పాన్‌ నంబర్‌ ఇవ్వని పక్షంలో కంపెనీ(ఎంప్లాయర్‌) లేదా బ్యాంకు పన్నును వసూలు

మొబైల్స్‌, విడిభాగాల తయారీకి బడ్జెట్లో రాయితీలు?

Saturday 25th January 2020

 ప్రత్యేక కేటాయింపులు మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టబోయే కేం‍ద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం డిజిటల్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేయనుంది. ప్రస్తుత ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజీతో పరుగులు పెడుతుండడంతో... ఈ రంగంలో పెట్టుబడులు పెడుతూ.. అమెరికా, చైనా, జపాన్‌ ,దక్షిణ కొరియా వంటి దేశాలు ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌, మొబైల్‌ తయారీకి కావాల్సిన విడిభాగాల  ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించి,

Most from this category