News


ఎగిసి పడిన పసిడి..!

Thursday 26th September 2019
Markets_main1569473854.png-28561

ప్రపంచమార్కెట్లో నిన్న రాత్రి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర భారీగా ఎగసి అంతే స్థాయిలో పతనమైంది. ఉదయం అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలపై సందిగ్ధతతో పాటు అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో పసిడి ధర  ఒకదశలో 1,542.55 డాలర్ల వద్ద గరిష్టస్థాయి అందుకుంది. అయితే రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూల వ్యాఖ్యలు, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ చేయడంతో పసిడి ఉదయం ఆర్జించిన లాభాలన్ని తుడిచిపెట్టుకు పోయాయి. రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని అనుకున్న సమయానికి కంటే ముందుగానే కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రకటనతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు అమెరికాలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో నిన్నరాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 3నెలల గరిష్టానికి ఎగిసింది. ఫలితంగా డాలర్‌కు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే పసిడి నిన్న ట్రేడింగ్‌లో ఒకదశలో 30డాలర్లు నష్టపోయింది. సెప్టెంబర్‌05 తరువాత పసిడి ఇంత భారీస్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. చివరికి 28డాలర్లు నష్టపోయి 1,512.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ పతనాన్ని చవిచూసిన పసిడి గురువారం స్వల్పంగా లాభపడింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు పెరిగి 1,517 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  నేడు డాలర్‌ ఇండెక్స్‌ క్షీణత, ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌, నిన్న భారీ పతనం అనంతరం పసిడి ఫ్యూచర్లో షార్ట్‌ కవరింగ్‌ తదితర కారణాలు పసిడికి మద్దతినిస్తున్నాయి.
దేశీయంగా అదే ధోరణి:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర ట్రేడ్‌ అవుతుంది. ప్రపంచమార్కెట్లో పసిడి ధర భారీ పతనంతో నిన్న ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర 506లు నష్టపోయి రూ.37602 వద్ద ముగిసింది. నేడు రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం కావడంతో పాటు ఈక్విటీ మార్కెట్‌కు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.46.00లు లాభంతో రూ. 37648.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

లాభాల్లో పెట్రో షేర్లు...హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్ల ర్యాలీ

Thursday 26th September 2019

గరిష్ట స్థాయిలకు చేరుకున్న చమురు ధరలు గత కొన్ని సెషన్‌ల నుంచి పడిపోతుండడంతో దేశీయ ఇంధన కంపెనీ షేర్లు గురువారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు తగ్గడంతో  హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌) షేరు ఉదయం 10.35 సమయానికి  5.22 శాతం లాభపడి రూ. 300.30 వద్ద, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) 4.87 శాతం లాభపడి రూ. 147.55 వద్ద, ఓన్‌జీసీ 2.05 శాతం లాభపడి రూ. 134.15 వద్ద ట్రేడవుతున్నాయి.

బ్యాంక్‌ షేర్ల ర్యాలీ..ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం అప్‌

Thursday 26th September 2019

నేటితో (సెప్టెంబర్‌ 26, గురువారం) మార్కెట్‌లో సెప్టెంబర్‌ ప్యూచర్‌ అండ్‌ ఆప్సన్స్‌ కాంట్రాక్ట్‌ ముగియనుండడంతో మార్కెట్‌ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఉదయం 10.09 సమయానికి నిఫ్టీ 105.30 పాయింట్లు లాభపడి 11,545.50 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 329.31 పాయింట్లు లాభపడి 38,923.44 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ లాభాలకు కారణమవుతున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 499.50 పాయింట్లు లాభపడి 30047.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన ఐసీఐసీఐ

Most from this category