News


మూడు రోజూ నష్టాల్లో ముగిసిన పసిడి ధర

Saturday 31st August 2019
Markets_main1567240277.png-28130

డాలర్‌ ఇండెక్స్‌లో బుల్లిష్‌ కదలిక నెలకొన్న నేపథ్యంలో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాలతో ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి  ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 7.75డాలర్లు క్షీణించి 1,529.15 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేసి 98.94 స్థాయి వద్ద ముగిసింది. ఈ వారంలో జరిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఈక్విటీ, బాండ్‌ ఈల్డ్స్‌ ర్యాలీ చేయడం, డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం పసిడి ధరపై కొంత ఒత్తిడికి కలిగించాయి. వారం మొత్తం మీద 8డాలర్లు నష్టపోయింది. ఆగస్ట్‌లో పసిడి ధర 100డాలర్లకు (6 శాతం) పైగా ర్యాలీ చేసింది. ఒకవేళ వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినప్పటికీ.., ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ మందగమనం కొనసాగింది. వృద్ధి అనేది ఒకరాత్రిలోనే జరిగే విషయం కాదు. కాబట్టి, పసిడికి అంతర్లీనంగా బాండ్‌ ఈల్డ్‌ పతనం నుంచి మద్దతు లభిస్తుందని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
దేశీయంగా రూ.147ల నష్టం:- 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి క్షీణత తదితర అంశాలతో ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ గత రాత్రి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.147లు నష్టపోయింది. నిన్నరాత్రి ఎంసీక్స్ మార్కెట్‌ ముగిసే సరికి రూ.38656.00 వద్ద స్థిరపడింది.ఈ వారం మొత్తం మీద పసిడి ధర రూ.109 నష్టపోయింది.



You may be interested

ఈ బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టింగా?.. జాగ్రత్త!

Saturday 31st August 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నాలుగు ప్రధాన బ్యాంకుల విలీనాలను గురించి శుక్రవారం ప్రకటించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునిటెడ్‌ బ్యాంక్‌లను విలీనం చేసి, ఈ బ్యాంక్‌ను రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా మార్చనుండగా, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌లను విలీనం చేసి నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు యూనియన్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసి

42 పాయింట్ల నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 31st August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,012.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11058.90 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల నష్టంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 42 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొండిబాకీలతో కుదేలవుతున్న

Most from this category