News


స్థిరంగా పసిడి

Tuesday 22nd October 2019
Markets_main1571724584.png-29049

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం లాభంతో 1,489 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చర్చలపై సరైన వివరణ లేకపోవడంతో పసిడికి మద్దతు లభిస్తోంది. యూ.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ఆశావహనంగా మాట్లాడిన అనంతరం చైనా ఉప విదేశాంగ మంత్రి లే యుచెంగ్ స్పందించారు. చైనా, అమెరికాలు తమ వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి సాధించాయి. ఇరుపక్షాలు ఒకరి సమస్యను ఒకరు పూర్తిగా అర్ధం చేసుకోనంత వరకు ఏ సమస్యను పరిష్కరించుకోలేమని తెలిపారు. వైట్ హౌస్ సలహాదారు లారీ కుడ్లో మాట్లాడుతూ చర్చలు సజావుగా జరిగితే డిసెంబరులో చైనా వస్తువులపై సుంకాలను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. ఒప్పందం లేని బ్రెగ్జిట్‌, అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతుండటంతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు రిస్క్‌-ఆన్‌ మోడ్‌లోకి వచ్చాయి. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు మద్దతు తగ్గుతోందని పసిడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ ఆశించినట్లుగానే ఫెడ్‌ రిజర్వ్‌ అక్టోబర్‌ ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్లపై 25బేసిస్‌ పాయింట్ల వడ్డీరేట్ల కోత విధించినట్లైతే అప్పుడు పసిడి ధరల్లో బలమైన కరెక‌్షన్‌ లోనయ్యే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్ల నష్టంతో 1,488.50డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా స్థిరంగానే:-
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటంతో దేశీయంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.20లు స్వల్ప నష్టంతో రూ.37870.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎంసీఎక్స్‌ మార్కెట్‌ సాయంత్రం వరకు పనిచేయలేదు. అనంతరం జరిగిన ట్రేడింగ్‌లో... అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పతనం ప్రభావంతో రూ.38000ల స్థాయి కోల్పోయి రూ.199లు నష్టపోయి రూ.37,890 వద్ద స్థిరపడింది. 



You may be interested

తగ్గిన చమురు

Tuesday 22nd October 2019

యుఎస్‌-చైనా మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కారించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు స్థిరంగా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్‌ తగ్గడంతో చమురు మార్కెట్లు ప్రతికూల దృక్పథంతోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఉదయం 11.22 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.25 శాతం నష్టపోయి బారెల్‌ 58.81 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.34 శాతం నష్టపోయి బారెల్‌ 53.33 డాలర్‌ వద్ద ట్రేడవుతున్నాయి.

బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Tuesday 22nd October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సెషన్లో ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికి బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 218.10 పాయింట్లు లాభపడి 29,338.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.47 శాతం లాభపడి రూ. 1,234.75 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.70 శాతం లాభపడి రూ. 445.25 వద్ద, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.03 శాతం

Most from this category