News


డాలర్‌ ర్యాలీ: వారం కనిష్టానికి పసిడి ధర

Saturday 15th December 2018
Markets_main1544870312.png-22972

డాలర్‌ ర్యాలీ మరోసారి పసిడిని ముంచింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 5డాలర్లు నష్టపోయి 1,242.30డాలర్ల వద్ద ముగిసింది. ఈ ధర పసిడి వారం కనిష్టస్థాయి కావడం గమనార్హం. హాలిడే షాపింగ్‌ అమ్మకాలు పెరుగుదల, గ్యాసోలిన్‌ ధరల తగ్గుదలతో అమెరికా నవంబర్‌ రిటైల్‌ గణాంకాలు విశ్లేషకుల అంచనాలకు మించి 0.2శాతంగా నమోదయ్యాయి. యూరప్‌ దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, వడ్డీరేట్లపై ఈసీబీ సానుకూల వైఖరితో ఆరుకరెన్సీ విలువల్లో యూరో బలహీనత డాలర్‌కు కలిసొచ్చింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలు కూడా డాలర్‌కు బలాన్నిచ్చాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.450 స్థాయికి ఎగిసింది. డాలర్‌ ర్యాలీతో పసిడి ఫ్యూచర్లలో అమ్మకాలు మొదలై ఒకనొక దశలో 11డాలర్లు నష్టపోయి 1236.50డాలర్ల కనిష్టానికి చేరుకుంది. చివరకు 5.10డాలర్లు నష్టపోయి 1,242.30 డాలర్ల వద్ద స్థిరపడింది. అలాగే వచ్చేవారంలో డిసెంబర్‌ 20న జరిగే ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం వడ్డీరేట్ల నిర్ణయంపై ఇన్వెస్టర్లు ఎదురుస్తున్నారు.
ఇక వారంపరంగా చూస్తే....
1. ఈ వారంలో పసిడి ధర 1,255.60 - 1,236.50 స్థాయిలో కదలాడి శుక్రవారం రాత్రి ట్రేడింగ్‌ ముగిసేసరికి 1,242.30 వద్ద ముగిసింది.
2.ఇదే వారంలో 4రోజులు నష్టాలతో ట్రేడవగా, శుక్రవారం అత్యధికంగా నష్టపోయింది. ఒక్క గురువారం మాత్రం 0.22శాతం లాభపడింది.

దేశీయంగా స్వల్ప లాభంతో ముగింపు:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నష్టపోయినా దేశీయంగా మాత్రం స్వల్పంగా లాభాపడింది. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.26.00లు పెరిగి రూ.31553.00ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత పసిడి పెరుగుదలకు కారణమైంది.You may be interested

వడ్డీరేట్ల తగ్గింపు తప్పదు!

Saturday 15th December 2018

క్రిస్‌ వుడ్‌ అంచనా ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకంతో ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో సడలింపులు కనిపించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ వ్యూహకర్త క్రిస్‌వుడ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో ఇకపై వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఎంపీసీ నిర్ణయాలు ఉండొచ్చన్నారు. మరోపక్క కన్జూమర్‌ ప్రైస్‌ ద్రవ్యోల్బణం తగ్గడం కూడా రేట్ల తగ్గింపునకు అవకాశమిస్తుందని చెప్పారు. నవంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి దిగివచ్చింది. తాజా గణాంకాలతో రేట్ల విషయంలో ఆర్‌బీఐ మరీ కఠినంగా ఉంటోందన్న అంచనాలున్నాయన్నారు. ద్రవ్యోల్బణం తగ్గినందున

వృద్ది మాత్రమే కావాలంటే రిస్కు తప్పదు!

Saturday 15th December 2018

రాజన్‌ హెచ్చరిక ప్రభుత్వం స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మరచి కేవలం వృద్ధి పైనే దృష్టి సారిస్తే రిస్కులు తప్పవని ప్రముఖ ఆర్ధికవేత్త రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న  ఎకానమీల్లో ఒకటైన భారత్‌ వృద్ది ధ్యాసలో పడి మాక్రో ఎకనమిక్‌ స్టెబిలిటీని పణంగా పెడితే అనర్ధాలు తప్పవని ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్టు గీతా గోపినాధ్‌ సైతం హెచ్చరిస్తున్నారు. స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనకు స్థిరమైన అల్పద్రవ్యోల్బణాన్ని మెయిన్‌టెయిన్‌ చేయడం, ప్రైవేట్‌

Most from this category