News


భారీగా తగ్గిన బంగారం

Friday 8th November 2019
Markets_main1573183796.png-29426

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 32 డాలర్లు పతనమై 1,460 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ధర తగ్గుతూ వుంటుంది. కానీ  హెడ్జ్‌ ఫండ్స్‌, మనీ మేనేజర్లు వారి గోల్డ్‌ హోల్డింగ్స్‌లో కొంతభాగాన్ని విక్రయించడంతో ధర పడిపోయింది. ఈ క్రమంలో భారత్‌లో గత రాత్రి మల్టీ కమోడిటీ ఎక్సే‍్ఛంజ్‌లో సైతం 10 గ్రాముల పుత్తడి రూ.600 వరకూ పతనమై, 37,550 వద్ద ముగిసింది. ఈ ధరకు అనుగుణంగా బుధవారం దేశంలోని స్పాట్‌ మార్కెట్లో సైతం ధరలు తగ్గే అవకాశం వుంటుంది. వెండి ధర సైతం ఎంసీఎక్స్‌లో కేజీకి రూ. 1400 వరకూ క్షీణించింది. ఇక బుధవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో పుత్తడి ధర క్రితం రాత్రి ముగింపుతో పోలిస్తే స్వల్ప పెరుగుదలతో 1,468 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

క్యాషే .. కింగ్‌..

Friday 8th November 2019

 నగదు లావాదేవీలకే పెద్ద పీట మళ్లీ కరెన్సీ నోట్లను భారీగా దాచుకుంటున్న జనం మరోవంక డిజిటల్‌ లావాదేవీల్లోనూ భారీ వృద్ధి ఆర్థిక వ్యవస్థకూ అప్పటి సైడ్‌ ఎఫెక్ట్స్ నోట్ల రద్దుకు మూడేళ్లు పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం.

రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌తో వీటికి లాభం!

Friday 8th November 2019

నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏఐఎఫ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం రియల్‌ ఎస్టేట్‌ రంగంతోపాటు, ఇళ్ల నిర్మాణంతో అనుసంధానమైన ఉన్న పలు ఇతర రంగాల కంపెనీలకూ ప్రోత్సాహం ఇవ్వనుంది. విశ్లేషకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ‘‘నిలిచిపోయిన నివాసిత రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులను వేగంగా ముందుకు కదిలించేందుకు రూ.25,000 కోట్లతో ఏఐఎఫ్‌ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైతే మరింత నిధిని సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని మార్కెట్లు

Most from this category