News


భారీగా తగ్గిన బంగారం

Wednesday 6th November 2019
Markets_main1573010224.png-29379

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 27 డాలర్లు పతనమై 1,483 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ధర తగ్గుతూ వుంటుంది. కానీ మంగళవారం రాత్రి హఠాత్తుగా హెడ్జ్‌ ఫండ్స్‌, మనీ మేనేజర్లు వారి గోల్డ్‌ హోల్డింగ్స్‌లో కొంతభాగాన్ని విక్రయించడంతో ధర పడిపోయింది. ఈ క్రమంలో భారత్‌లో గత రాత్రి మల్టీ కమోడిటీ ఎక్సే‍్ఛంజ్‌లో సైతం 10 గ్రాముల పుత్తడి రూ.600 వరకూ పతనమై, 37,880 వద్ద ముగిసింది. ఈ ధరకు అనుగుణంగా బుధవారం దేశంలోని స్పాట్‌ మార్కెట్లో సైతం ధరలు తగ్గే అవకాశం వుంటుంది. వెండి ధర సైతం ఎంసీఎక్స్‌లో కేజీకి రూ. 1100 వరకూ క్షీణించింది. ఇక బుధవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో పుత్తడి ధర క్రితం రాత్రి ముగింపుతో పోలిస్తే స్వల్ప పెరుగుదలతో 1,487 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. You may be interested

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌!

Wednesday 6th November 2019

విస్తరణలో సైతం తగ్గని పెయింట్ల కంపెనీలు ఏటా రెండంకెల వృద్ధి; పల్లెలకూ ప్రీమియం రంగులు రూ.50,000 కోట్లకు పరిశ్రమ; భారీగా పెరిగిన షేర్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి నూతన రూపు తెస్తుంటారు. యజమానులు తమ ఇంటికైనా, ఆఫీసుకైనా గతంలో 6–8 సంవత్సరాలకు ఒకసారి పెయింట్‌ వేయించేవారు. ఇప్పుడు 4–5 ఏళ్లకే వేయిస్తున్నారట. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌ విషయంలో

జీడీపీకి త్వరలో బేస్‌ ఇయర్‌ మార్పు?

Wednesday 6th November 2019

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు  బేస్‌ ఇయర్‌ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల్లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జీడీపీ గణాంకాలకు 2011-12 బేస్‌ ఇయర్‌గా ఉంది. దీనిని 2017-18కి మార్చనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పునకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని, మార్పిడిపై ముందస్తు ప్రక్రియ, గణాంకాల

Most from this category