News


మళ్లీ పసిడి మెరుపు- చమురు మంట

Wednesday 8th January 2020
Markets_main1578455565.png-30749

1603 డాలర్లను తాకిన ఔన్స్‌ బంగారం 
70 డాలర్లకు బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 
అమెరికా సైన్యంపై ఇరాన్‌ ప్రతిదాడుల ఎఫెక్ట్‌

హెచ్చరించిన విధంగానే ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిస్సైళ్లను ప్రయోగిచడం ద్వారా ప్రతిదాడులకు దిగడంతో ఉన్నట్టుండి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ముదిరాయి. వెరసి అటు బంగారం, ఇటు ముడిచమురు ధరలు మరోసారి రివ్వుమని పైకెగశాయి. తొలుత న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి ధర స్పాట్‌ మార్కెట్లో 1603 డాలర్లను తాకింది. 2013 మార్చి తదుపరి ఇది అత్యధికంకాగా.. మరోపక్క లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 70 డాలర్లకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 65 డాలర్లను అధిగమించింది. గత వారం బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడులతో ఇరాన్‌, ఇరాక్‌ అత్యున్నత అధికారులు మరణించడంతో తాజాగా ఇరాన్‌ ప్రతిదాడులకు దిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

ఇదీ తీరు
న్యూయార్క్‌ కామెక్స్‌లో బుధవారం ఉదయం 9 ప్రాంతంలో ఔన్స్‌ బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ 16 డాలర్లు(1 శాతం) పెరిగి 1590 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 2 శాతంపైగా ఎగసి 1606 డాలర్లను తాకింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 1.2 శాతం బలపడి 18.61 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.45 శాతం పుంజుకుని 69.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 70.72 డాలర్లకు చేరింది. ఇదే విధంగా న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 1.5 శాతం పెరిగి 63.64 డాలర్ల వద్ద కదులుతోంది. తొలుత 4.5 శాతం జంప్‌చేసి 65.54 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలలో మూడో వంతు వాటా కలిగిన ఇరాక్‌, ఇరాన్‌లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చమురు ధరలకు ఆజ్యం పోస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి సహజంగానే ఇటీవల గిరాకీ పెరిగినట్లు తెలియజేశారు.You may be interested

లాస్‌ వేగాన్‌ అవతార్‌ షో

Wednesday 8th January 2020

అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో 2020 కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్‌ ట్యాక్సీలను ఎస్‌–ఏ1 పేరిట ఆవిÙ్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్‌ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే

ఎయిర్‌ ఇండియా వాటా విక్రయ ఒప్పందానికి ఆమోదం

Wednesday 8th January 2020

ఈఓఐలకు కూడా ఆమోదం తెలిపిన జీఓఎమ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సం‍స్థ, ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. ఎయిర్‌ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి అసక్తి గల సంస్థల నుంచి  ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్‌(మంత్రుల సంఘం-గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పచ్చజెండా ఊపింది. అంతే కాకుండా వాటా కొనుగోలు ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. హోమ్‌ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన గల

Most from this category