News


ఇరాక్‌ టెన్షన్‌- పసిడి, చమురుకు రెక్కలు

Friday 3rd January 2020
Markets_main1578022711.png-30635

గురువారం రాత్రి ఇరాక్‌లోని బాగ్దాద్‌ వద్ద అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు వెలువడిన వార్తలు అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలకు ఆజ్యం పోశాయి. ఈ దాడుల కారణంగా బాగ్దాద్‌  విమానాశ్రయం వద్ద ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ఇద్దరు ముఖ్య అధికారులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చన్న ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి ఓవైపు డిమాండ్‌ ఏర్పడగా.. చమురు సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలతో చమురు ధరలు సైతం పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలలో ఇరాన్‌, ఇరాక్‌లకు ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా ఉన్న విషయం విదితమే.  

3 శాతం అప్‌
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం లండన్‌ మార్కెట్లో బ్రెం‍ట్‌ చమురు బ్యారల్‌ 3 శాతం ఎగసి 68.25 డాలర్లను తాకగా.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 2.9 శాతం పెరిగి 63 డాలర్ల సమీపానికి చేరింది. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 1 శాతం బలపడి 1542 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి ఔన్స​0.8 శాతం పుంజుకుని 18.18 డాలర్లకు చేరింది.  



You may be interested

బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

Friday 3rd January 2020

జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువులపై సమీక్ష దశలవారీగా పన్ను రేట్లు పెంచే యోచన మార్చి జీఎస్టీ కౌన్సిల్‌ల్లో కీలక సమావేశం సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి.

పీఎస్‌బీల ‘ఈబిక్రయ్‌’

Friday 3rd January 2020

స్వాధీనం చేసుకున్న ఆస్తుల వేలానికి పోర్టల్‌ ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్‌ ‘ఈబిక్రయ్‌’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) చీఫ్‌లు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంకింగ్‌ రంగ అంశాలపై మంత్రి చర్చించారు. వ్యాపార రీత్యా వివేకంతో తీసుకునే నిర్ణయాలకు రక్షణ ఉంటుందన్న

Most from this category