News


భగ్గుమన్న బంగారం, క్రూడాయిల్‌ ధరలు

Saturday 4th January 2020
Markets_main1578110567.png-30662

  • ఇరాన్‌ కమాండర్‌ని అమెరికా‍​హతమార్చిన నేపథ్యం
  • 4 శాతం పెరిగి 64 డాలర్లను తాకిన నైమెక్స్‌ క్రూడ్‌
  • 25 డాలర్లు ఎగసిన బంగారం
  • భౌగోళిక ఉద్రిక్తతలతో సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు


న్యూఢిల్లీ: ఇరాన్‌ కమాండర్‌ ఖాసీమ్‌ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్‌, డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే...
    బంగారం:- అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌ (నైమెక్స్‌)లో శుక్రవారం బంగారం ఔన్స్‌ (31.1గ్రా) ధర 25 డాలర్లు ఎగసి 1,553.95 డాలర్ల స్థాయి తాకింది. పసిడికి ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి. ఇక దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఒక దశలో 10 గ్రాములు.. 24 స్వచ్ఛత పసిడి ధర రూ.791 లాభంతో రూ.40,068 వద్ద ట్రేడయ్యింది. గురువారంతో పోల్చితే ఇది 2 శాతంకన్నా అధికం. వెండి కేజీ ధర కూడా ఒకశాతం పైగా పెరుగుదలతో రూ. 47,507 వద్ద ట్రేడయ్యింది. దేశంలోని పలు స్పాట్‌ మార్కెట్లలో కూడా పసిడి ధరలు రూ.40,000, వెండి ధరలు 51,000పైన ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర లాభాలతో.. 18.14 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. రూపాయి బలహీనత కొనసాగి, అంతర్జాతీయంగా ధరలు పటిష్టంగా ఉంటే .. సోమవారం దేశీయ స్పాట్‌ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

క్రూడ్‌:-  ఇక క్రూడ్‌ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో స్వీట్‌ నైమెక్స్‌ బ్యారల్‌ ధర ఒక దశలో 4 శాతం పెరిగి 64 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇరాన్‌ హెచ్చరించిన నేపథ్యంలో బంగారం సహా క్రూడ్‌ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నది నిపుణుల అంచనా. డాలర్ ఇండెక్స్‌ కూడా ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పటిష్టంగా (96.48) కొనసాగుతుండడం గమనార్హం. 



You may be interested

భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

Saturday 4th January 2020

2019లో అత్యధికంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఇదే పరిస్థితి 2020లోనూ కొనసాగొచ్చు: డీబీఎస్‌ సింగపూర్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్‌ గ్రూపు డీబీఎస్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు తప్పు..

Saturday 4th January 2020

కేసు రికార్డుకు పూర్తి విరుద్ధం మిస్త్రీ పునర్నియామకం ఆదేశాలపై సుప్రీంకు రతన్‌ టాటా టాటా ట్రస్టులు, గ్రూప్‌ సంస్థలు కూడా న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలతో  మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు టాటా ట్రస్ట్‌లు,

Most from this category