News


రూ.38వేల దిగువన పసిడి

Saturday 16th November 2019
Markets_main1573884824.png-29640

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర శుక్రవారం రూ.38వేల దిగువన ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండోరోజూ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ పసిడి ధర నష్టాల బాట పట్టింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.272లు నష్టపోయి రూ.37994.00 వద్ద స్థిరపడింది. దేశీయంగా వారం మొత్తం మీద 10గ్రాముల పసిడి ధర రూ.307లు లాభపడింది.
ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: 5డాలర్లు నష్టపోయిన పసిడి
అమెరికా - చైనా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలు మళ్లీ వెలుగులోకి రావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాం‍డ్‌ పడిపోయింది. ఫలితంగా నిన్నరాత్రి అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 4.90 డాలర్ల నష్టపోయి 1,468.50డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిలను చేరుకోవడం, ట్రెజరీ ఈల్డ్‌ పెరగడం, డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం పసిడి ప్యూచర్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా పసిడి ధర ఇటీవల భారీగా నష్టపోయింది. అయితే.., టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా పసిడి ధర బలంగానే కన్పిస్తుందని బులియన్‌ విశ్లేషకుడు మార్క్‌ బెర్న్‌ అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా చూస్తే గరిష్టస్థాయి నుంచి కనిష్ట(హైయర్‌ లో), గరిష్టం నుంచి గరిష్టం(హయ్యర్‌ హైస్‌) సీరీస్‌లో భాగంగా పసిడి బుల్లిష్‌గా ఉంది. ధీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజింగ్స్‌ బాగున్నాయి.  ఇక ఫండమెంటల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి చూస్తే.. పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు నికర కొనుగోలుదార్లుగా మారడం, బలమైన రిటైల్ పెట్టుబడి డిమాండ్... పసిడికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ వారం మొత్తం మీద పసిడి ధర 5.60డాలర్లు(0.4శాతం) లాభపడింది. 



You may be interested

అన్ని టెల్కోలు కొనసాగాలి.. అదే నా కోరిక!

Saturday 16th November 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏ టెలికం కంపెనీ కూడా మూతపడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, రుణభారంతో కుదేలైన టెలికం రంగాన్ని ఆదుకోవాలనే యోచిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఏ టెల్కో మూసేయాలని తాను కోరడం లేదని, అన్ని టెల్కోలు కొనసాగాలని, కస్టమర్లకు సేవలందించాలనే తాను ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. ధరల యుద్ధంతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అశనిపాతంలా తగిలింది. ఏజీఆర్‌ బకాయిలు

వొడాఫోన్‌ ఐడియాపై రేటింగ్‌ సంస్థల డేగకన్ను!

Saturday 16th November 2019

వారంలో మరో డౌన్‌గ్రేడింగ్‌ ఛాన్సులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియా కంపెనీ(వీఐఎల్‌)పై రేటింగ్‌ కంపెనీలు నిశితంగా దృష్టి సారించాయి. రూ. 51వేల కోట్ల నష్టం ప్రకటించిన వీఐఎల్‌ తన అప్పుల నుంచి ఎలా బయటపడుతుందోనని ఏజన్సీలు పరిశీలిస్తున్నాయి. గత నెల సుప్రీం తీర్పుఅనంతరం క్రిసిల్‌, కేర్‌ రేటింగ్స్‌లు వీఐఎల్‌పై నెగిటివ్‌ క్రెడిట్‌వాచ్‌ను ఉంచాయి. దీంతో పాటు  వీఐఎల్‌ బ్యాంకు లోన్‌ సదుపాయాన్ని, ఎన్‌సీడీలను కేర్‌ రేటింగ్స్‌ ఏ నుంచి ఏ

Most from this category