News


మళ్లీ ఆరేళ్ల గరిష్టానికి పసిడి ధర

Monday 26th August 2019
Markets_main1566801539.png-28019

ప్రపంచమార్కెట్లోని పసిడి ధర సోమవారం మళ్లీ ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. వాణిజ్య సుంకాల విధింపు అంశంలో అమెరికా-చైనాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్లో ఔన్స్‌ పసిడి ధర 27డాలర్లు పెరిగి 1,564.95 స్థాయిని అందుకుంది. పసిడి ధరకు ఇది వరుసగా రెండోరోజూ ర్యాలీ కావడం విశేషం. వాణిజ్య యుద్ధంలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని శుక్రవారం చైనా తెలిపింది. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన వెంటనే చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారిఫ్‌లను పెంచుతున్నట్లు  ట్రంప్‌ శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించారు. ఈ టారిఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నిన్న జరిగిన జీ7 సదస్సులో చైనాపై వాణిజ్యయుద్ధపై వెనక్కి తగ్గి ప్రసక్తి లేదని ట్రంప్‌  స్పష్టం చేశారు. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల ముగింపుకు కొనసాగింపుగా నేడు ఆసియా మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో పసిడి ధర 27డాలర్లు పెరిగి 1,564.95 స్థాయిని అందుకుంది. అయితే గరిష్టస్థాయి వద్ద కొంత లాభాల స్వీకరణ జరగడంతో ఉదయం గం.11:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 15డాలర్లు(1శాతం) లాభంతో 1,552.15డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ట్రంప్‌ ట్విట్టర్‌ సునామి నుంచి పసిడి ధర లాభపడిందని వీఎం మార్కెట్స్‌ మేనిజింగ్‌ పాట్నర్‌ స్టీఫెన్‌ ఇన్స్‌ తెలిపారు. రానున్న రోజుల్లో పసిడి ధర 1,546 - 1,569డాలర్ల శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
దేశీయంగా కొనసాగుతున్న రికార్డు ర్యాలీ:- 
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల రికార్డు ర్యాలీ కొనసాగుతుంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్డు 10గ్రాముల పసిడి ధర క్రితం గతవారం ముగింపు ధర(రూ.38765)తో పోలిస్తే రూ.369ల లాభంతో రూ. 39,134.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. నేడు డాలర్‌ మారక విలువలో రూపాయి భారీ బలహీనపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీగా పెరగడం తదితర కారణాలతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో రూ.575లు లాభపడి రూ.39,340.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:45 ని.లకు రూ.538.00 లాభంతో రూ.39303.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఉద్దీపనల ప్రభావం స్వల్పకాలికమేనా?!

Monday 26th August 2019

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం కొన్ని ఆర్థిక చర్యలను ప్రకటించారు. కానీ ఈ ఆర్థిక చర్యలు కొద్దికాలానికే మార్కె‍ట్లకు ఉత్సాహాన్నిస్తాయని దీర్ఘకాలానికి మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం ప్రకటించిన చర్యలలో ముఖ్యమైనది బడ్జెట్లో ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీని ఎత్తివేయడం, కానీ దీని ఫలితాన్ని దేశియ హెడ్జ్‌ఫండ్స్‌ వాడుకోకుండా చేయడంపై ఇన్వెస్టర్లు

662 పాయింట్లు ఎగిసి... 872 పాయింట్లు వెనుతిరిగి...

Monday 26th August 2019

లాభాలు నిలుపుకోలేని సెన్సెక్స్‌ నిఫ్టీ 244 పాయింట్లు వెనక్కి దేశీయ మార్కెట్‌ ప్రపంచమార్కెట్ల ప్రభావానికే తలొగ్గింది. ఫలితంగా ఉద్దీపన చర్యల లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలయ్యాయి. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవడం, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. అంచనాలకు తగ్గట్టుగానే నేడు సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 వద్ద, నిఫ్టీ 171

Most from this category