News


పసిడి, చమురు ధరలు జూమ్‌

Monday 6th January 2020
Markets_main1578282208.png-30693

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రికత్తల ఎఫెక్ట్‌
2 శాతం చొప్పున ఎగసిన పసిడి, చమురు
ఏడేళ్ల గరిష్టాన్ని తాకిన కామెక్స్‌ బంగారం

గత వారం చివర్లో మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తాజాగా బంగారం, ముడిచమురు ధరలు వరుసగా రెండో రోజు జోరందుకున్నాయి. బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడుల ద్వారా ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరానియన్‌ జనరల్‌ ఖాసిమ్‌ను డ్రోన్‌ దాడుల ద్వారా అమెరికా కాల్చి వేయడంతో ఇరాన్‌ ‍ప్రతిదాడులకు దిగనున్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ మార్కెట్లో ముడిచమురుతోపాటు, బంగారం ధరలు మరోసారి రివ్వుమన్నాయి.

3 శాతం అప్‌
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 ప్రాంతంలో న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1.8 శాతం లాభపడి 1580 డాలర్ల వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 1588 డాలర్ల వరకూ ఎగసింది. ఇది ఏడేళ్ల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2013 ఏప్రిల్‌ 10న మాత్రమే ఔన్స్‌ పసిడి 1580 డాలర్లను తాకింది. ఇక వెండి సైతం ఔన్స్‌ 1.9 శాతం పుంజుకుని 18.50 డాలర్లకు చేరింది. కాగా.. మరోపక్క లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 2.7 శాతం జంప్‌చేసింది. 70.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్‌లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 2.25 శాతం పెరిగి 64.50 డాలర్లకు చేరింది. 2019లో సైతం పసిడి ధరలు 18 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!



You may be interested

డిపాజిట్‌ క్యాన్సిలేషన్‌ వద్దు..!

Monday 6th January 2020

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెట్టుబడి విషయంలో ఇది సౌకర్యవంతమైన సాధనం. బ్యాంకు శాఖకు వెళ్లి గంట వ్యవధిలో డిపాజిట్‌ చేయడం, అవసరమైనప్పుడు వెళ్లి గంటలో నగదుగా మార్చుకోగల సౌకర్యం ఇందులో ఉంది. ఇతరత్రా ఎటువంటి సమస్యలూ ఇందులో ఉండవు. భద్రత కూడా ఎక్కువే. రాబడి తక్కువే ఉన్నా ఎక్కువ మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఇష్టపడడానికి కారణం ఈ అంశాలే. డిపాజిట్‌

‍ప్రణాళికతోనే ప్రశాంతత

Monday 6th January 2020

జీవిత భాగస్వామితో కలసి ఆర్థిక ప్రణాళిక అన్ని ముఖ్య విషయాలు పంచుకోవాలి తప్పనిసరిగా అన్నింటికీ నామినీ రిజిస్ట్రేషన్‌ జీవిత భాగస్వామిని నామినీగా పేర్కొంటే బెటర్‌ అనుకోనిది జరిగితే సమస్యల్లేకుండా చూసుకోవచ్చు భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో

Most from this category