News


చల్లబడ్డ చమురు, పసిడి ధరలు

Thursday 9th January 2020
Markets_main1578542182.png-30784

5 శాతం పతనమైన నైమెక్స్‌ చమురు
4 శాతం నీరసించిన బ్రెంట్‌ బ్యారల్‌
1600 డాలర్లకు దిగివచ్చిన పసిడి ఔన్స్‌

మధ్యప్రాచ్యంలో చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ ఇకపై ప్రత్యక్ష దాడులకు దిగబోమన్న సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడింది. దీంతో ఇటీవల రివ్వుమని పైకెగసిన ముడిచమురు, బంగారం ధరలు ఉన్నట్టుండి దిగివచ్చాయి. ఇరాన్‌ మిసైళ్ల దాడుల కారణంగా ప్రాణనష్టం వాటిల్లలేదంటూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడం‍తో ఉద్రిక్తతలు చల్లారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 3 డాలర్లు(4 శాతం) క్షీణించి 65.44 డాలర్లకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌ మారెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ సైతం 3 డాలర్లకుపైగా(5 శాతం) నీరసించి 59.61 డాలర్లను తాకింది. ఇక పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) ధరలుసైతం 1 శాతం నీరసించి 1560 డాలర్లకు చేరాయి.

అక్కడక్కడే 
ప్రస్తుతం(గురువారం ఉదయం) బ్రెంట్‌ బ్యారల్‌ 0.64 శాతం బలపడి 65.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్‌ బ్యారల్‌ 0.8 శాతం పుంజుకుని 60.08 డాలర్ల వద్ద కదులుతోంది. బుధవారం ఉదయం ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణులతో దాడి చేయడంతో ముడిచమురు ధరలు దాదాపు 5 శాతం జంప్‌చేయగా.. పసిడి ధర సైతం 2.5 శాతం ఎగసిన విషయం విదితమే. దీంతో లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 70 డాలర్లను అధిగమించగా.. బంగారం ఔన్స్‌ 1703 డాలర్లకు చేరింది.

పసిడి తీరిలా
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1559 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్‌ 0.4 శాతం క్షీణించి 18.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఎస్‌బీఐ విన్నూత గృహరుణ పథకం

Thursday 9th January 2020

ఎస్‌బీఐ ప్రకటన ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్‌బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5

త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం

Thursday 9th January 2020

ఐవోబీ ఎండీ కరణం శేఖర్‌ ధీమా మొండిబాకీల రికవరీపై కసరత్తు ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాలపై మరింత దృష్టి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్‌ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన

Most from this category