STOCKS

News


స్మాల్‌క్యాప్‌ రికవరీ.. ఇక్కడ చూడండి..!

Friday 27th September 2019
Markets_main1569524064.png-28572

మార్కెట్లో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రికవరీ బాట పట్టాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే గత 16 సెషన్లకుగాను 13 సెషన్లలో స్మాల్‌క్యాప్‌ సూచీ లాభపడింది. దీంతో ఈ నెలలో ఇప్పటికే 8 శాతానికి పైగా పెరిగింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 4.4 శాతమే పెరగ్గా, అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ గత నెల రోజుల్లోనే 52 శాతం ర్యాలీ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

  • అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టార్‌ పేపర్‌ మిల్స్‌ ఈ నెలలో ఇప్పటికి 52 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో ఈ స్టాక్‌ 42 శాతం పతనం కాగా, సెప్టెంబర్‌లో గణనీయంగా రికవరీ అయింది. జూన్‌ త్రైమాసికం చివరికి స్టార్‌ పేపర్‌ మిల్స్‌లో గోయల్‌కు 3,09,000 షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఇది 1.98 శాతం వాటాకు సమానం. 
  • ధమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌లో గోయల్‌కు ఏకంగా 10.74 శాతం వాటా ఉంది. 70,00,000 షేర్లను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ.150కోట్లు. ఈ నెలలో ధమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌ షేరు 50 శాతం వరకు పెరిగింది. ఆగస్ట్‌ వరకు ఈ స్టాక్‌ కేవలం 8 శాతమే క్షీణించింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నికరంగా 35 శాతానికి పైగా పెరిగినట్టు. 
  • ఆటో విడిభాగాల కంపెనీ శివమ్‌ఆటోటెక్‌ షేరు ఈ నెలలో 40 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆగస్ట్‌ వరకు 57 శాతం నష్టపోగా, ఇందులో 40 శాతం రికవరీ అయింది. కంపెనీలో గోయల్‌కు 4,20,000 షేర్లు (1.42 శాతం వాటా) ఉన్నాయి.  ఐజీ పెట్రోకెమికల్స్‌ షేరు ఈ నెలలో 31 శాతం పెరింది. కంపెనీలో గోయల్‌కు 1.89 శాతం వాటా ఉంది. గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని తిరుమలై కెమికల్స్‌, సౌత్‌ఇండియా పేపర్‌ మిల్స్‌, అమర్‌జ్యోతి స్పిన్నింగ్‌ మిల్స్‌, ద్వారికేష్‌ షుగర్‌ ఇండస్ట్రీస్‌ కూడా 16-28 శాతం మధ్య పెరిగాయి.
  • మాజెస్కో ఆటో, అవధ్‌ షుగర్‌, ద్వారికేష్‌ షుగర్‌, త్రివేణి ఇంజనీరింగ్‌ షేర్లు 12-23 శాతం మధ్య సెప్టెంబర్‌లో పెరిగాయి. 

 

‘‘బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వాటి చారిత్రక కనిష్ట స్థాయికి దిగువనే ట్రేడవుతున్నాయి. ఇప్పుడు అవి పెరుగుతున్నాయంటే ఇన్వెస్టర్లు వాటిని ఫాలో అవుతున్నట్టే. ఇప్పటి వరకు చాలా పరిమిత ర్యాలీనే చూశాం. ప్రభుత్వ చర్యల ఫలితం ఆర్థిక రంగంపై కనిపిస్తుంది. దీనిని వచ్చే కొన్ని నెలల్లో, సంవత్సరాల్లో చూడొచ్చు. పన్నుకోత మౌలిక సదుపాయాలపై నిధుల వ్యయాలకు, నూతన సామర్థ్యాల ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది’’ అని బీఎన్‌పీ పారిబాస్‌కు చెందిన అభిరామ్‌ ఏలేశ్వరపు తెలిపారు.You may be interested

70.95 వద్ద రూపీ ప్రారంభం

Friday 27th September 2019

దేశీయ కరెన్సీ రూపీ,  డాలర్‌ మారకంలో శుక్రవారం 7 పైసలు బలహీనపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా చైనాతో వాణిజ్య ఒప్పందం అనుకున్న సమయం కంటే ముందే ఏర్పడే వీలుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 16 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీంతోపాటు గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు  పాజిటివ్‌గా ట్రేడవ్వడం,

మార్చి నాటికి 43,000కు సెన్సెక్స్‌!?

Friday 27th September 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్థానిక, అంతర్జాతీయ అంశాల కారణంగా ఇంత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టు చెప్పారు గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హిమాన్షుగుప్తా. కానీ, ప్రభుత్వ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత, మంచి వర్షాలు తాజా పెట్టబడులను ఆకర్షించగలవన్నారు. దీంతో వచ్చే మార్చి నాటికి నిఫ్టీ 12,500ను పరీక్షిస్తుందని తెలిపారు. సెన్సెక్స్‌ 43,000 లక్ష్యాన్ని చేరుతుందన్నారు. 11,800 స్థాయి నిఫ్టీకి కీలకమని,

Most from this category