News


గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌- టీసీఐ ‘ఎక్స్‌ప్రెస్‌’ స్పీడ్‌

Monday 3rd February 2020
Markets_main1580721086.png-31471

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 8 శాతం జూమ్‌
సరికొత్త గరిష్టానికి టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ 

కరోనా వైరస్‌ ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతన బాటను పట్టినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే వారాంతాన కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లు బలపడి 40,789ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,687 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కోల్డ్‌ సప్లై చైన్‌కు మద్దతుగా కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించింది. దీంతో లాజిస్టిక్స్‌ రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

టీసీఐ ఎక్స్‌ప్రెస్‌
బడ్జెట్‌లో కూరగాయలు, పండ్లు తదితర ఆహార సరుకుల రవాణాకు వీలుగా శీతల సౌకర్యాల రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. తద్వారా సరుకు పాడవకుండా వేగవంత రవాణాకు అవకాశం ఏర్పడనుంది. ఇది లాజిస్టిక్స్‌ కంపెనీలకు డిమాండ్‌ను పెంచడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 915 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 925 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 10 రోజుల్లో ఈ కౌంటర్‌ 26 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ ఏడాది క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడం కూడా టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ కౌంటర్‌ లాభపడేందుకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. క్యూ3లో కంపెనీ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 26 కోట్లను తాకింది.

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ నికర లాభం 9 శాతం బలపడి రూ. 45 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ లాభం మరింత అధికంగా 60 శాతం పెరిగి రూ. 151 కోట్లకు చేరింది. దీనిలో జేవీలో వాటా విక్రయం ద్వారా లభించిన మొత్తం కలసి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 491 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో విక్రయానికి వీలయ్యే 12.7 మిలియన్‌ చదరపు అడుగులు కలిగిన నాలుగు ప్రాజెక్టులను జత చేసుకున్నట్లు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు 8.3 శాతం జంప్‌చేసి రూ. 1072 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1088 వరకూ ఎగసింది.You may be interested

ఎస్కార్ట్స్‌- ఇన్ఫో ఎడ్జ్‌.. దూకుడు

Monday 3rd February 2020

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ 9 శాతం ప్లస్‌ 9 శాతం జంప్‌చేసిన ఇన్ఫో ఎడ్జ్‌ ఈ ఏడాది జనవరిలో ట్రాక్టర్ల విక్రయాలు పుంజుకోవడంతో ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు క్యూకి డిజిటల్‌ మీడియాలో పెట్టుబడుల వార్తలతో ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌, రిక్రూట్‌మెంట్‌ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్కార్ట్స్‌

టాటా మోటార్స్‌ డౌన్‌

Monday 3rd February 2020

టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు క్షిణించడంతో  షేర్‌ ధర  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 3  శాతం తగ్గి, రూ. 161 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఈ ఏడాది జనవరిలో టాటా మోటార్స్‌  వాహన విక్రయాలు 18 శాతం తగ్గి 47,862 యూనిట్లకు చేరాయి. ఈ వాహనాలను దేశ,విదేశీ మార్కెట్లో విక్రయించింది. కాగా 2019 జనవరిలో 58,185 యూనిట్లను విక్రయించింది. దేశీ మార్కెట్‌లో వార్షికప్రాతిపదికన వాహనాల విక్రయం 18

Most from this category