News


గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేరులో ఆగని పతనం

Thursday 30th January 2020
Markets_main1580379351.png-31343

సిగిరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ షేరు వరుసగా పతనమవుతూనే ఉంది. గురువారం ఇంట్రాడేలో షేరు దాదాపు 6 శాతం క్షీణించింది. ముగింపు సమయానికి దాదాపు 4.65 శాతం క్షీణించి రూ. 1190 వద‍్ద క్లోజయింది. దీంతో మూడు సెషన్లలో షేరు దాదాపు 18 శాతం క్షీణించినట్లయింది. కంపెనీలో ప్రమోటర్ల వాటాను అమ్ముతామన్న లలిత్‌ మోదీ ప్రకటన షేరులో కరెక‌్షన్‌ తెచ్చింది. అయితే ప్రమోటర్‌గ్రూప్‌ వాటాలు అమ్మక ప్రకటనను కంపెనీ ఖండించింది. తమకు ఈ విషయమై ఎలాంటి సమాచారం అందలేదని ప్రకటించింది. కంపెనీకి చెందిన ప్రముఖ ప్రమోటర్‌ నుంచి ఈ విషయమై స్పష్టత పొందామని తెలిపింది. కానీ కంపెనీ ప్రకటనను లలిత్‌మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. కంపెనీని అబద్ధాలకోరుగా అభివర్ణించారు. వాటాల విక్రయానికి సంబంధించి కోట్రస్టీలకు తాను రాసిన ఉత్తరాన్ని ఆయన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. వాటాలు అమ్మడం లేదన్న కంపెనీ ప్రకటన కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. కేకే మోదీ అనంతరం ఆయన భార్య బీనా మోదీ గ్రూప్‌ వ్యవహారాల అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. దీన్ని లలిత్‌ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మోదీ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను విక్రయించాలని ‍ప్రతిపాదన తెచ్చారు. మోదీ కుటుంబంలో ఈ లుకలుకల కంపెనీ షేరుపై నెగిటివ్‌ ప్రభావం చూపుతున్నాయి. 



You may be interested

ప్రపంచ మార్కెట్ల దెబ్బ- సెన్సెక్స్‌ బోర్లా

Thursday 30th January 2020

సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనం 94 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఫార్మా కౌంటర్లు కుదేల్‌ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలా జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బోర్లాపడ్డాయి. ఇందుకు పలు అంశాలు కారణంకాగా.. సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనమైంది. 41,000 పాయింట్ల దిగువన 40,914 వద్ద ముగిసింది. ఇదేవిధంగా నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 12,036 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలతో మరోసారి ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికితోడు

6నెలల కాలానికి టాప్‌-5 సిఫార్సులు

Thursday 30th January 2020

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు తక్కువ రిస్క్‌ రివార్డు రేషియో కలిగిన ఐదు షేర్లను సిఫార్సు చేస్తున్నాయి.అవి..... షేరు పేరు: మాస్టెక్‌ రేటింగ్‌:- కొనవచ్చు బ్రోకరేజ్‌ సంస్థ :- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టార్గెట్‌ ధర:- రూ.510.00 కాల పరిమితి:- 6నెలలు విశ్లేషణ:- సవాలుతో కూడిన వాతావరణంలో ఖర్చులను నియంత్రించగలిగింది. బ్రిటన్‌ ప్రభుత్వంతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నందున అక్కడి ప్రభుత్వ రంగంలో ఆఫ్‌షోరింగ్ అవకాశాలను దక్కించుకొని కంపెనీ లాభం పొందుతుంది. అలాగే ఐటీ రంగంలో తన ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ

Most from this category