News


అధిక వాల్యూషన్‌ ఉన్న షేర్లే బెటర్‌!

Friday 7th February 2020
Markets_main1581056397.png-31593

శంకర్‌ శర్మ సంచలన సూచన
సాధారణంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో అందరూ అల్ప పీఈ(ప్రైస్‌ టు ఎర్నింగ్‌) నిష్పత్తి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. పీఈ తక్కువగా ఉన్న షేర‍్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు అనలిస్టులు లెక్కిస్తారు. కానీ సీనియర్‌ అనలిస్టు శంకర్‌ శర్మ తాజాగా కొత్త సూచన చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అధిక పీఈ ఉన్న స్టాకులను కొనడం, అల్ప పీఈ ఉన్న స్టాకులను షార్ట్‌ చేయడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. దేశీయ మార్కెట్లో కొంత కాలంగా ఇదే ట్రెండ్‌ నడుస్తోందన్నారు. వాల్యూషన్లపరంగా బాగా ఖరీదుగా మారిన స్టాకులనే ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనడం, తక్కువ వాల్యూషన్ల షేర్లను వదిలించుకోవడం జరుగుతోందన్నారు. దేశీయ విధాన నిర్ణయాల ఫలితంగా పెద్ద కంపెనీలు మరింత పెద్దవిగా మారడం, చిన్నవి మనుగడ పోరాటం చేయడం కనిపిస్తోందని కొంతకాలంగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పట్లో మారకపోవచ్చని శర్మ అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌ పరిశీలిస్తే ఇప్పట్లో ఇండియా 7-8 శాతం వృద్దిని అందుకునే అవకాశం లేదని అర్దమవుతోందని, చిన్నకంపెనీలను తొక్కేస్తూ పెద్ద కంపెనీలు మరింతగా ఎదుగుతాయని చెప్పారు. 
ఇండియాపై అంచనాలను తగ్గించుకోవాలని శర్మ సూచించారు. 5 శాతం జీడీపీకి అలవాటుపడాలని, ప్రభుత్వం హడావుడిగా వృద్ధి వెనుక పరుగుతీయాలనుకోవడం లేదని చెప్పారు. మార్కెట్లలో చిన్న వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోతుండడంతో కేంద్రీకృత లక్షణం కనిపిస్తోందని, అటు చూస్తే యూఎస్‌లో చిన్న వ్యాపారాలే అద్భుతంగా రాణిస్తున్నాయని చెప్పారు. గతేడాది ఇండియా మార్కెట్లు చాలా దారుణ ప్రదర్శన జరిపాయని, అంతర్జాతీయ మార్కెట్లు దాదాపు 40 శాతం దూసుకుపోతే మన మార్కెట్‌ కేవలం 8-9 శాతం వృద్ధినిచ్చిందని తెలిపారు. ఈ ఏడాది కూడా ఇప్పట్లో ఏమీ అద్భుత ర్యాలీ వచ్చే ఛాన్సులు లేవన్నారు. ఎఫ్‌పీఐల నిధుల వరద మన వద్దకు మాత్రమే కాదని, పలు అంతర్జాతీయ మార్కెట్లలో విదేశీ మదుపరులు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారని వివరించారు. మార్కెట్లు అధిక వాల్యూషన్‌ ఉన్నా క్వాలిటీ కంపెనీలకే పట్టం కడుతున్నాయన్నారు. స్టీల్‌, సిమెంట్‌, ఇన్‌ఫ్రా రంగాలు వాల్యూ ట్రాప్స్‌ని అభిప్రాయపడ్డారు. వీటిలో పెట్టుబడులకు ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని సూచించారు. మార్కెట్లు, ఎకానమీ ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయని తాను భావించడం లేదని తెలిపారు. You may be interested

ట్రెంట్‌- అరబిందో.. ఒకటే జోరు!

Friday 7th February 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ 7 శాతం జంప్‌చేసిన షేర్లు వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో సెన్సెక్స్‌ 112 పాయింట్లు క్షీణించి 41,140కు చేరగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,111 వద్ద ట్రేడవుతోంది. ఈ  నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అటు రిటైల్‌ రంగ టాటా గ్రూప్‌

ఎస్‌బీఐ వడ్డీ రేట్ల కోత

Friday 7th February 2020

రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు తాజా రేట్లు ఈ నెల 10 నుంచీ అమలు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల ప్రభావం ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) తాజాగా వడ్డీ రేట్లలో కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 10(సోమవారం) నుంచీ అమలు చేయనున్నుట్లు ఎస్‌బీఐ పేర్కొంది. తాజా సవరణలో భాగంగా రుణాలకు వర్తించే మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను 5 బేసిస్‌ పాయింట్లమేర తగ్గించింది. దీంతో

Most from this category