News


52వారాల గరిష్టానికి జీఎంఆర్‌

Wednesday 6th November 2019
Markets_main1573029187.png-29395

మౌలిక రంగంలో సేవలను అందిచే జీఎంఆర్‌ షేరు మిడ్‌సెషన్‌ కల్లా ఏడాది 52వారాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.20.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో ఒక దశలో దాదాపు 9శాతం లాభపడి రూ.22.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.20.65)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.22.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.12.95లు రూ.22.45లుగా ఉన్నాయి. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 266 పాయింట్లు పెరిగి రూ.40,514.31 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 40,514.31 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 



You may be interested

పెరిగిన కెనరా బ్యాంక్‌ లాభం...షేరు 3 శాతం అప్‌

Wednesday 6th November 2019

3శాతానికి పైగా ర్యాలీ చేసిన షేరు  మెండిబకాయిలకు  కేటాయింపులు తగ్గడం, ఇతర ఆదాయాలు పెరగడంతో కెనరా బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్లో మెరుగైన పనితీరును కనబరిచింది. వార్షిక ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో రూ.365 కోట్ల నికర లాభం సాధించింది. గతే ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో సాధించిన రూ.299.5 కోట్లతో పోలిస్తే ఇది 22శాతం అధికం. మొత్తం ఆదాయం 15.42శాతం వృద్ధితో రూ.15509.36 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో మొత్తం ఆదాయం

మారుతి అంచనాలను తగ్గించిన సుజుకీ మోటర్స్‌

Wednesday 6th November 2019

దేశీయ కార్ల తయారి సం‍స్థ మారుతి సుజుకీ విక్రయాల అంచనాలను (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను)ఈ కంపెనీ మాతృ సంస్థయిన సుజుకీ మోటర్‌ కార్పోరేషన్‌(ఎస్‌ఎంసీ) సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో ఆటో రంగం మందగమనంలో ఉండడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మారుతి సుజుకీ అమ్మకాలు 20 శాతం పడిపోతాయని అంచనావేసింది. పూర్తి ఏడాదిలో 4 శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాల్ని కొద్దినెలల క్రితమే కంపెనీ ప్రకటించింది.  ఈ

Most from this category