News


ఏడాది గరిష్టానికి జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు

Friday 3rd January 2020
news_main1578042842.png-30650

 మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏడాది గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.21.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 7.60 శాతం పెరిగి రూ.23.35 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.2:30ని.లకు 5శాతం లాభంతో 22.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.12.95లు రూ.23.35లు ఉన్నాయి. మరోవైపు ఇదే రంగానికి మిగిలిన నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3శాతం, సీఈఎస్సీ షేరు 2శాతం, భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌, రిలయన్స్‌ పవర్‌, సిమెన్స్, అదానీ పవర్‌, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్‌ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు 1శాతం వరకు నష్టపోయాయి. మొత్తంగా నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇండెక్స్‌ 0.75శాతం నష్టపోయింది. 



You may be interested

2020లో ఐటీ స్టాక్స్‌ జోష్‌?

Friday 3rd January 2020

ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ ఆకర్షణీయంకాదు బీమా రంగ కౌంటర్లు భేష్‌ కమోడిటీలకూ మంచి రోజులు? బడ్జెట్‌లో మరీ ప్రతికూలమైన అంశాలు లేకుంటే..  ఆర్థికంగా సైక్లికల్‌ రికవరీని ఆశించవచ్చునంటున్నారు టీసీజీ ఏంఎసీ సీఐవో, ఎండీ చక్రీ లోకప్రియ. రానున్న ఏడాది లేదా రెండేళ్ల కాలంలో మిడ్‌ క్యాప్స్‌ ర్యాలీ నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ట్రెండ్‌ మారుతోంది.. చార్టుల

ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గేవరకూ గరిష్టంలోనే చమురు

Friday 3rd January 2020

చమురు ధరలు ఇప్పటికే 3 శాతం అప్‌ ఇరాన్‌ ప్రతిచర్యలు ప్రభావం చూపవచ్చు గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయంవద్ద అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల కారణంగా ఇరానియన్‌ జనరల్‌ కాసిమ్‌ మృతి చెందడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాక్‌ చెందిన అధికారులు సైతం మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3 శాతం ఎగశాయి. ప్రపంచ చమురు సరఫరాలలో మూడో వంతు వాటాను కలిగిన ప్రాంతంలో నెలకొన్న

Most from this category