STOCKS

News


ట్రంప్‌ టారీఫ్‌ల హెచ్చరిక.. గడగడలాడుతున్న గ్లోబల్‌ మార్కెట్లు

Friday 2nd August 2019
Markets_main1564721287.png-27485

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో అ‍ంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) ఏసియా-పసిఫిక్‌ ఇండెక్స్‌(జపాన్‌ కాకుండా) షేర్లు 1.6 శాతం పడిపోయి, జూన్‌ లో తాకిన కనిష్టాలుకు చేరుకున్నాయి. జపాన్‌ నికాయ్‌ కూడా 2.4 శాతం నష్టపోయింది. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బెంచ్మార్క్ షాంఘై కాంపోజిట్ 1.5 శాతం, బ్లూ-చిప్ సిఎస్ఐ 300 1.6 శాతం పతనమయ్యాయి. వీటితోపాటు హాంకాంగ్ హాంగ్ సెంగ్ 2.2 శాతం పడిపోయింది. యుఎస్‌ ఎస్ అండ్‌ పి 500 ఇండెక్స్‌ 0.9 శాతం పడిపోయి, ఒక నెల కనిష్టాన్ని తాకింది. ఫలితంగా ఎసియన్‌ ట్రేడ్‌లో యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ 0.4 శాతం నష్టపోయింది. వీటితో పాటు పాన్-యూరోపియన్ యూరో స్టాక్స్ 50 ఫ్యూచర్స్ 1.9 శాతం పతనమయ్యింది. 
   యు.ఎస్- చైనా సంధానకర్తల మధ్య షాంఘైలో జరిగిన రెండురోజుల సమావేశం, ఎటువంటి పురోగతి లేకుండా ముగిసిన విషయం తెలిసిందే. ఇది జూన్‌లో యుఎస్‌-చైనా మధ్య జరిగిన సంధి చర్చలు విఫలమయ్యాయనే అంచనాలను ఇవ్వడంతో అంతర్జాతీయ వాణిజ్యం మరిం‍త దెబ్బతింది. యునైటెడ్ స్టేట్స్- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ‘మరింత దూరంగా ఉంది’ అని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శుక్రవారం అన్నారు. కాగా ఈ చర్యను చైనా స్టేట్ మీడియా ఖండించడం గమనర్హం. చైనా  ‘దశాబ్దాల చెడు ప్రవర్తన’ వలనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగిందని, యుఎస్‌ సుంకాలు విధించడానికి కారణమయ్యిందని, అంతేకాకుండ ఇతర చర్యలు తీసుకోడానికి ప్రేరేపించిందని యు.ఎస్. విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో విమర్శించడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.  
   ఈ సుంకాలు విధించడంతో ఇన్వెస్టర్లు యు.ఎస్. బాండ్లు, జపాన్‌ యెన్, బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా చైనీస్ యువాన్, ఆస్ట్రేలియన్ డాలర్ కొన్ని నెలల కనిష్టాలకు చేరుకున్నాయి. బంగారం ఔన్స్‌ ఆసియాలో 0.9 శాతం తగ్గి  1,432.58 డాలర్ల వద్ద ఉంది. ఇది గత సెషన్‌లో 2.4 శాతం పెరిగి, ఆరు వారాల గరిష్ట స్థాయి 1,453 డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల యుఎస్ బాండ్ ఈల్డ్‌లు గురువారం దాదాపు 12 బేసిస్ పాయింట్లు పడి 1.902 శాతానికి చేరుకున్నాయి. ఫెడ్‌ రేట్ల కోత కొనసాగదని చెప్పినప్పటికి ప్రస్తుతం ట్రంప్‌ నిర్ణయాల వలన వాణిజ్య విధానాల ప్రమాదాల నుంచి యుఎస్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోడానికి ఈ ఏడాది డిసెంబర్‌ లోపు ఇంకో 25 బేసిస్‌ పాయింట్ల రేట్ల కొతను ఫెడ్‌ చేయక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.   
    ఈ కొత్త సుంకాలు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ కంప్యూటర్ల నుంచి బొమ్మలు, పాదరక్షల వరకు వినియోగదారుల వస్తువుల విస్తృత స్థాయిని తాకనున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఉత్పాదక రంగం నష్టపోయే అవకాశం ఉంది. ‘జాతీయ కర్మాగార కార్యకలాపాల సూచిక గత నెలలో 51.2 కు పడిపోయింది, ఆగస్టు 2016 తర్వాత ఇదే కనిష్ట స్థాయి’ అని యుఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ గురువారం తెలిపింది.
బ్రెంట్ క్రూడ్‌ 2.7 శాతం పెరిగి బ్యారెల్కు 62.12 డాలర్లకు చేరుకుంది. కాగా గురువారం సెషన్లో ఇది 7.0 శాతం పడిపోయింది. ఇది ఫిబ్రవరి 2016 తర్వాత అత్యధిక రోజువారి పతనం కావడం గమనర్హం. డబ్ల్యుటిఐ క్రూడ్‌ 2.1 శాతం పెరిగి 55.10 డాలర్లకు చేరుకుంది. ఇది గత సెషన్‌లో 7.9 శాతం పడిపోయింది. You may be interested

తెరపైకి ట్రేడ్‌వార్‌: పరుగులు పెడుతున్న పసిడి ధర

Friday 2nd August 2019

అమెరికా చైనాల మథ్య మరోసారి ట్రేడ్‌ వార్‌ తెరపైకి పసిడి ధర శుక్రవారం పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 29డాలర్లు (2శాతం) పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 300 విలువైన డాలర్ల చైనా దిగుమతులపై 10శాతం మేర పన్ను విధిస్తున్నట్లు నిన్నరాత్రి  ప్రకటించారు. ఈ విధింపు సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనాతో జరుగుతున్న చర్చలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన అధిక పరిమాణంలో

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఐఎల్‌:- నిధులను ఎవర్‌గ్రీన్‌ రుణాలకు మళ్లించినట్లు విదేశీ ఇన్వెస్టర్‌ ఒకరు ఆర్‌బీఐకు ఫిర్యాదు చేశారు.  తల్వాకర్స్ బెటర్ వాల్యూ వాల్యూ ఫిట్‌నెస్‌:- జూలై 31న చెల్లించాల్సిన రూ.3.5 కోట్ల వడ్డీరేట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది దిష్‌మాన్‌ కార్బోజెన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ కంపెనీ అనుబంధ సంస్థ న్యూలాండ్‌ యూనిట్‌ను తనిఖీలు పూర్తి చేసినట్లు తెలిపింది.  ఎసీసీ:- కంపెనీ సీఎఫ్‌ఓగా రజనీ కేసరీ నియమితులయ్యరు.  ఎల్‌ఐసీ

Most from this category