News


నష్టాల్లో ప్రారంభమైన అంతర్జాతీయ మార్కెట్లు

Monday 2nd September 2019
Markets_main1567401646.png-28142

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించికున్న తాజా టారిఫ్‌లు సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా సెప్టెంబర్‌ 2(సోమవారం) ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ ప్యూచర్‌ 1.06 శాతం నష్టపోగా, జపాన్‌ నికాయ్‌ 225 0.28 శాతం, ఎంఎస్‌సీఐ జపాన్‌ వెలుపల ఆసియా పసిఫిక్‌ షేర్స్‌ ఇండెక్స్‌ 0.3 శాతం  నష్టపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుండడంతో హాంగ్‌ కాంగ్‌ హంగ్‌సెంగ్‌ 0.5 శాతం పతనమయ్యింది. ఎకనామిక్‌ పాలసీ సర్దుబాట్లను పెంచుతామని చైనా స్టేట్‌ కౌన్సిల్‌ ప్రకటించడంతో చైనా కాంపోజిట్‌ షాంఘై ఇండెక్స్‌ మాత్రం 0.3 శాతం లాభపడడం గమనార్హం. పాదరక్షలు, స్మార్ట్ వాచ్‌లు, ఫ్లాట్-ప్యానెల్ టెలివిజన్లతో సహా వివిధ రకాల చైనా వస్తువులపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం 15 శాతం సుంకాలను విధించారు. కాగా యుఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్‌ ఆయిల్‌పై చైనా కొత్త సుంకాలను విధించింది. ఈ పెరుగుదల వలన యు.ఎస్. గృహాలకు ఒక్కొక్కదానికి ఏడాదికి 1,000 డాలర్లు అదనంగా ఖర్చవుతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యుఎస్‌ నుంచి దిగుమతీ చేసుకుంటున్న 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనపు సుంకాలను చైనా విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా సుంకాలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి. 



You may be interested

తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Monday 2nd September 2019

ఆగస్టులో భారీ క్షీణత మారుతీ అమ్మకాల్లో 33 శాతం తగ్గుదల  న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్‌, హోండా కార్స్‌ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్‌-6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్‌ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల

హైదరాబాద్‌ స్థలాన్ని విక్రయించిన ఎవరెడీ

Monday 2nd September 2019

బ్యాటరీల తయారీలో ఉన్న బి.ఎమ్‌.ఖైతాన్‌ గ్రూప్‌ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌.. హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని న్యూలాండ్‌ టెక్నాలజీస్‌కు విక్రయించింది. డీల్‌ విలువ రూ.100 కోట్లు. మౌలాలి ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఇది నెలకొని ఉంది. విక్రయం ద్వారా వచ్చిన వనరులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఎండీ అమృతాంశు ఖైతాన్‌ వెల్లడించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ఇక్కడి ప్లాంటులో ఉత్పత్తి 2010 నుంచి నిలిచిపోయింది. అప్పులను తగ్గించుకోవడంలో

Most from this category