News


పెట్టుబడులపై గ్లోబల్‌ స్లోడౌన్‌ ఎఫెక్ట్‌!

Tuesday 25th February 2020
Markets_main1582616528.png-32075

యెన్‌ బలపడితే వర్ధమాన మార్కెట్లకు దెబ్బ
ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో ప్రభుత్వంతో జత
ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ నిపుణులు మసాటో

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడగల అంశాలపై నిఘా ఉంచవలసిన అవసరమున్నట్లు ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌, గ్లోబల్‌ కార్పొరేట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ బిజినెస్‌ సీఈవో మసాటో మియాచీ పేర్కొంటున్నారు. దేశీయంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌, ఎనర్జీ తదితర విభాగాలలో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వంతో పలు జపనీస్‌ కంపెనీలు జత కట్టినట్లు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే జపనీస్‌ కరెన్సీ యెన్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో యెన్‌ విలువ బలపడితే.. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడవచ్చని తెలియజేశారు. ఇంటర్వ్యూలోని ఇతర వివరాలు చూద్దాం..

మెట్రో రైల్‌ ప్రాజెక్టులు
మౌలిక సదుపాయాల రంగంలో కీలక ప్రాజెక్టులకు సంబంధించి జపనీస్‌ ప్రభుత్వం దేశీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. 100 బిలియన్‌ డాలర్ల ఢిల్లీ ముంబై మెట్రో కారిడర్‌(డీఎంఐసీ) ప్రాజెక్టును ఇందుకు ఉదహరించవచ్చు. ఇదే విధంగా చెన్నై- బెంగళూరు ప్రాజెక్టును సైతం​ప్రస్తావించవచ్చు. ఈ రెండు పట్టణాలలోనూ కార్యకలాపాలు కలిగిన ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ ప్రాజెక్టుల అభివృ‍ద్ధి ద్వారా దీర్ఘకాలంలో లబ్ది పొందే వీలుంది. మూడు ప్రధాన విదేశీ కరెన్సీ(జీ3) బాండ్ల విషయంలో మా బ్యాంకు టాప్‌-5లో ఒకటిగా నిలుస్తోంది. విదేశీ కరెన్సీ సిండికేటెడ్‌ లోన్‌ బుక్‌ రన్నర్‌ సంస్థలలోనూ రెండో అగ్రగామిగా సంస్థగా సేవలందిస్తున్నాం. దేశీయంగా ప్రాజెక్ట్‌ ఫైనాన్సింగ్‌ సేవల్లో అందరింకటే ముందున్నాం.

ఎఫ్‌డీఐల విషయంలో
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐలు) సంబంధించి దేశీయంగా జపాన్‌ మూడో పెద్ద దేశంగా నిలుస్తోంది. ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌, టెలికమ్యూనికేషన్స్‌, కెమికల్‌, హెల్త్‌కేర్‌, ఫైనాన్షియల్‌ రంగాలలో 2000-2019 మధ్య కాలంలో 30 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఈ బాటలో ఇటీవల పలు జపనీస్‌ కంపెనీలు మౌలికసదుపాయాలు తదితర రంగాలలో భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాయి. ఇక మరోపక్క స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బెంగళూరులో హబ్‌ ఏర్పాటయ్యింది. You may be interested

హడ్కో రూ. 28,000 కోట్ల సమీకరణ!

Tuesday 25th February 2020

హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) రూ.28,000 కోట్ల నిధులు సమీకరించనుంది. బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ జరిపేందుకు ఈ వారంలో బోర్డు సమావేశం జరగనుందని మంగళవారం హడ్కో వెల్లడించింది. కాగా హడ్కో అధికృత మూలధనం రూ.2500 కోట్లు కాగా,పెయిడ్‌ అప్‌ ఈక్విటీ రూ.2,001.90 కోట్లుగా ఉంది. మంగళవారం మధ్యహ్నాం 2:15 గంటల ప్రాంతంలో హడ్కో షేరు 1.55 శాతం తగ్గి 31.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్స్‌- లుమాక్స్‌ ఆటో జూమ్‌

Tuesday 25th February 2020

ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలు ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా కెమికల్‌ రంగ కంపెనీ క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌, ఆటో విడిభాగాల కంపెనీల లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్లిన్‌

Most from this category