News


స్థిరంగా పసిడి

Wednesday 18th December 2019
news_main1576647134.png-30284

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై మిశ్రమ స్పందన, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారక విలువ వారం గరిష్టాన్ని అందుకోవడం తదితర కారణాలు పసిడి స్థిరమైన ర్యాలీకి దోహదపడుతున్నాయి. ట్రేడ్‌ డీల్‌ ఒప్పందం నేపథ్యంలో 18నెలల గరిష్టం వద్ద ఆసియా ఈక్విటీ షేర్లు నేడు కూడా అదే స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికాలో అంచనాలకు మించి ఆర్థిక గణాంకాలు నమోదు కావడం ఇందుకు కారణం. అలాగే నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు రికార్డు ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఔన్స్‌ పసిడి ధర 1,480 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగా స్థిరంగా:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎంసీక్స్‌ మార్కెట్లో నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.26లు లాభంతో రూ.37966.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు పసిడిపై ప్రభావాన్ని రూపాయి విలువ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.07 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల ధర రూ.69లు లాభపడి రూ.37940 వద్ద స్థిరపడింది. 



You may be interested

రూపాయి బలహీనత: ఐటీ షేర్లకు డిమాండ్‌

Wednesday 18th December 2019

ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండంతో సూచీలు వరుసగా రెండోరోజూ కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం సూచీలకు కలిసొస్తుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం లాభపడింది. అమెరికాలో నవంబర్‌ ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ వారం గరిష్టానికి ఎగిసింది.

12350 పాయింట్ల వరకు నిఫ్టీ!

Wednesday 18th December 2019

12070 పైన బలంగా ఉంటేనే... నిఫ్టీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 12070 పాయింట్ల పైన బలంగా ఉన్నంత వరకు 12290 - 12350 పాయింట్లను చేరే అవకాశాలు అధికమని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ట్రంప్‌ అభిశంసన సమావేశాల నేపథ్యంలో స్వల్పకాలానికి నిఫ్టీ పరిమిత కదలికలు చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయవచ్చని, కొంత వెనుకంజ వేసిన

Most from this category