News


ఫెడ్‌ మినిట్స్‌ కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 21st August 2019
Markets_main1566367778.png-27917

ఇన్వెస్టర్లు, ట్రేడర్లు యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌పై దృష్టిసారించిన నేపథ్యంలో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధరలు 3డాలర్ల నష్టంతో 1,512.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. జూలై 30, 31 తేదీల్లో జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ అమెరికాలో నేటి రాత్రి విడుదల కానున్నాయి. దాదాపు 10ఏళ్ల తరువాత ఫెడ్‌ వడ్డీరేట్లపై కోత విధించిన నేపథ్యంలో మినిట్స్‌ వివరాలు  పసిడి ధరకు కీలకం కానున్నాయి. ‘‘వెల్లడి కానున్న మినిట్స్‌ ఆధారంగా రానున్న రోజుల్లో వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పసిడి ర్యాలీకి లేదా పతనానికి కీలకమం కానుంది’’ అని ఐజీ మార్కెట్స్‌ విశ్లేషకుడు క్లేయి రడ్డా అభిప్రాయపడ్డారు. మరోవైపు పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 3వారాల గరిష్టం వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండటం పసిడి ధర స్థిరమైన ర్యాలీకి తోడ్పాటునిస్తుంది. వచ్చే నెలలో రేట్ల కోత పావు శాతం తగ్గింపు ఫ్యూచర్స్ పూర్తిగా ప్రైస్‌-ఇన్‌ నిర్ణయించారు.
దేశీయంగా రూ.100ల తగ్గింపు:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర వరుసగా రెండో రెండో నష్టాలతో ప్రారంభమైంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.102ల నష్టంతో 37902.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం పసిడికి ప్రతికూలంగా మారుతోంది. కిత్రం రాత్రి రూపాయి విలువ ఆర్నెళ్ల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికే 10గ్రాముల పసిడి ధర రూ.181 లాభపడి రూ.38004 వద్ద స్థిరపడింది. 



You may be interested

సీజీ పవర్‌ దెబ్బతో యస్‌ బ్యాంక్‌, ఎంఎఫ్‌లు విలవిల!

Wednesday 21st August 2019

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యుషన్స్‌, ఖాతాలను తారుమారు చేయడంతో పాటు వేలకోట్ల రూపాయిల మనిలాండరింగ్‌కు పాల్పడిన విషయాలు బయటపడడంతో ఈ సంస్థకు రుణాలిచ్చిన యస్‌ బ్యాంక్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి సీజీ పవర్‌ సంస్థలో యస్‌ బ్యాంక్‌ 12.8 శాతం వాటాను ఆధినంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో 7.1 శాతం పతనమయ్యి బీఎస్‌ఈలో

ఏ స్థాయి వద్దయినా బంగారాన్ని కొనండి: మార్క్‌ మొబియస్‌

Wednesday 21st August 2019

-మార్క్‌ మొబియస్‌ అనేక దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ మానేటరీ పాలసీని సులభతరం చేయడంతోపాటు, పెరిగిన క్రిప్టోకరెన్సీ వాడకం బంగారం వంటి నిజమైన ఆస్తుల డిమాండ్‌ను పెంచుతోందని వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అన్నారు. ​బంగారంలో పెట్టుబడులు దీర్ఘకాలంలో రివార్డులను ఇస్తాయని వివరించారు. ‘నగదు సరఫరా పెరుగుతుండడంతో బంగారం దీర్ఘకాలిక అవకాశాలు పైపైకి వెలుతున్నాయి’ అని అన్నారు. బంగారాన్ని ఏ స్థాయి వద్దయిన కొనుగోలు చేయడం మంచిదని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.

Most from this category