News


2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 27th November 2019
Markets_main1574842794.png-29899

అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా సాగుతున్నాయని ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర బుధవారం రెండువారాల కనిష్టం వద్ద కదలాడుతోంది. నేడు ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,458 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఆసియాలో ప్రధాన మార్కెట్లు పాజిటివ్‌ ట్రేడింగ్‌, నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల రికార్డు ముగింపు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్ల డిమాండ్‌ను తగ్గించాయి. ట్రేడ్‌ డీల్‌లో భాగంగా వాషింగ్టన్‌, బీజింగ్‌లు ఫేజ్‌-1 ఒప్పందం దాదాపు ఖరారు అయ్యింది. మిగిలిన సమస్యలపై పనిచేయడానికి ఇరుదేశాల ప్రతినిధులు అంగీకారం తెలిపారని నిన్న మంగళవారం ట్రంప్‌ తెలిపారు. రెండు దేశాల వాణిజ్య చర్చల ఉన్నతాధికారులు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలపై ప్రతిఒక్కరూ ఆశావహన దృక్పథంతో ఉన్నారని సీనియర్‌ కరెన్సీ స్ట్రాటస్టిక్‌ అధికారి ఒకరన్నారు. మెరుగైన ఆర్థిక గణాంకాలను పరిశీలించినట్లైతే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతున్న తరుణంలో నిన్నరాత్రి ఔన్స్‌ పసిడి ధర 3.40 డాలర్లు నష్టపోయి 1,460.30 వద్ద స్థిరపడింది. 
దేశీయంగా వరుసగా 7రోజూ నష్టాల్లోనే...
అంతర్జాతీయంగా పసిడి అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటం, ఇటీవల దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్రమంగా బలపడుతుండటం తదితర కారణాలతో ఎంసీఎక్స్‌లో పసిడి ధర వరుసగా 7రోజూ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.59లు బలపడి రూ.37664.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 2వారాల గరిష్టానికి చేరుకోవడంతో రూ.5ల స్వల్ప నష్టంతో రూ.37,718.00 వద్ద స్థిరపడింది. You may be interested

ఎంఎస్‌సీఐ సూచీలో కీలక మార్పులు, చేర్పులు

Wednesday 27th November 2019

ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) ఇండియా సూచీలో కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అసెట్‌మేనేజ్‌మెట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌ ఇండియా, కాల్గేట్‌ పాలిమాలివ్‌, డీఎల్‌ఎఫ్‌, సిమెన్స్‌ షేర్లను ఎమ్‌ఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో చేర్చాయి. మరోవైపు గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వోడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంక్‌ షేర్లను తొలగించింది.  ఎంఎస్‌సీఐ

వచ్చే ఏడాది ర్యాలీలో అధికశాతం షేర్లకు చోటు

Wednesday 27th November 2019

‘సిమెంట్‌, ఇండస్ట్రీయల్స్‌, పవర్‌, ఆటో, వినియోగం వంటి రంగాలు 10 శాతం నుంచి 30 శాతం మేర పడిపోయాయి. ఈ రంగాలలో బాటమ్‌ ఔట్‌ అయ్యి డిమాండ్‌ తిరిగి పుంజుకుంటే, మార్కెట్‌ మరింత పెరగుతుంది’ అని ఎండీ, సీఐఓ, టీసీజీ ఏఎంసీ, చక్రి లోకప్రియా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. మార్కెట్‌ మరింత పెరుగుతుంది.. ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి అంతర్జాతీయ కారణాలు, సెంటిమెంట్‌ మెరుగుపడడం

Most from this category