News


దేశీ మార్కెట్‌ వైపు గ్లోబల్‌ ఫండ్స్‌ చూపు!

Wednesday 26th February 2020
Markets_main1582700090.png-32103

కరోనా ప్రభావం తక్కువగా ఉండడమే కారణమంటున్న నిపుణులు
కరోనా వైరస్‌ ప్రభావం ఇండియా మార్కెట్‌పై పెద్దగా ఉండదని భావిస్తున్న విదేశీ మదుపరులు, గ్లోబల్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను భారత మార్కెట్లోకి మరలిస్తున్నాయి. భారత మార్కెట్‌ ఎక్కువగా స్థానిక అంశాలపై ఆధారపడుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని ఈస్ట్‌ స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, నార్త్‌కేప్‌ క్యాపిటల్‌లాంటి సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో దాదాపు మూడువేలమంది మరణించారు. ఈ వైరస్‌ క్రమంగా ఇటలీ, ఇరాన్‌ లాంటి పలు దేశాలకు విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఇండియాలో మాత్రం కేవలం మూడు కరోనా కేసులే నమోదయ్యాయి. దీంతో ప్రస్తుత పరిస్థితిలో ఇండియానే రక్షణాత్మక మార్కెట్‌గా ఫండ్స్‌కు కనిపిస్తోందని అనలిస్టు రాస్‌ కామరన్‌ చెప్పారు. ఇటీవల చమురు ధరల పతనం ఇండియా ఎకానమీకి పాజిటివ్‌ అన్నారు. ఇండియా ఇతర దేశాల్లాగా బహిర్గత అంశాలకు ఎక్కువగా ప్రభావితం కాదన్నారు. ఉదాహరణకు జనవరిలో హాంకాంగ్‌ గొడవల నేపథ్యంలో ఎంఎస్‌సీఐ ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ దాదాపు 7 శాతం పతనం కాగా, ఇండియా కేవలం 3 శాతం మాత్రమే క్షీణించిందని గుర్తు చేశారు.

ఈ ఏడాది ఆసియాలో ఇండియా మార్కెట్లోకి మాత్రమే భారీగా విదేశీ నిధులు వచ్చాయి. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుంటే ఇండియా మార్కెట్‌ విదేశీ ఫండ్స్‌కు తలదాచుకునే చోటుగా కనిపిస్తోందని మార్కెట్‌నిపుణుడు హర్ష ఉపాధ్యాయ చెప్పారు. ఇండియా ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని, దీంతో విదేశీ మదుపరులు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. కొందరు అనలిస్టులు మాత్రం ఇంకా ఇండియాలో పరిస్థితులు రికవరీ కి అడ్డంకిగా ఉన్నాయని భావిస్తున్నారు. లిక్విడిటీ కొరత, ఎన్‌బీఎఫ్‌సీ దివాలా వంటివి ఇంకా ప్రభావం చూపుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్టితో చూస్తే ఇండియానే అత్యంత సురక్షితంగా కనిపిస్తుందని ఎక్కువమంది ఫండ్‌ మేనేజర్లు భావిస్తున్నారు. చమురు ధరలు మరింత దిగివచ్చి, కమోడిటీల ధరలు కూడా తగ్గితే మరింత మంది ఫండ్‌ మేనేజర్లు ఇండియా వైపు వస్తారని నిపుణుల అంచనా.You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 26th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు సిప్లా: సిప్లాకు చెందిన గోవా ఫెసిలిటీ కేంద్రానికి యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖను రాసింది. బంధన్‌ బ్యాంక్‌: ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ ప్రాంతాల్లో బంధన్‌ బ్యాంక్‌ శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ 3–5 డాలర్ల డిస్కౌంట్‌తో 500 మిలియన్‌ బేరల్స్‌ క్రూడ్‌ను కొనుగోలు చేసింది. వొకార్డ్‌: ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వొకార్డ్‌కు లాంగ్‌ టర్మ్‌ రేటింగ్‌ బీబీ ఫ్లస్‌ను

మెటల్‌ షేర్లలో అమ్మకాలు: జిందాల్‌ స్టీల్‌ 5శాతం డౌన్‌

Wednesday 26th February 2020

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. దీంతో నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఒక దశలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

Most from this category