News


ఆర్థిక మాంద్యం భయాలు..8 ఏళ్లలో అధికం

Monday 19th August 2019
Markets_main1566211593.png-27872

వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం రానుందనే అంచనాతో ప్రతి ముగ్గురు అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌లలో ఒకరు ఉన్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌(బీఆఫ్‌ఏ-ఎంఎల్‌) తాజాగా నిర్వహించిన సర్వే పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్న అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌లలో 34 శాతం మంది వచ్చే 12 నెలలో ఆర్థిక మాంద్యం రానుందనే అంచనాతో ఉన్నారని, అక్టోబర్‌ 2011 తర్వాత ఇదే అధికమని ఈ బ్యాంక్‌ నివేదిక తెలుపుతోంది. ఈ సర్వేని అగష్టు 2-అగష్టు 8 మధ్య మొత్తం 553 బిలయన్‌ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న 224 ప్యానలిస్టులతో నిర్వహించారు. ఈ ఫండ్‌ మేనేజర్లలో సగం మంది, కార్పోరేట్‌ సంస్థలు రుణవిముక్తికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, వారి బ్యాలెన్స్‌ షీట్ల మెరుగుదలకు చర్యలను తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ‘కార్పొరేట్లు తమ బ్యాలెన్స్‌ షీట్లను మెరుగుపరుచుకోడానికి మూలధన వ్యయాన్ని లేదా క్యాష్‌ బ్యాక్‌లను ఉపయోగించడం కంటే నగదును ఉపయోగించడం మంచిదని ఇన్వెస్టర్లలో అత్యధిక మంది అభిప్రాయపడ్డారు’ అని ఈ సర్వే తెలిపింది. అంతేకాకుండా ట్రేడ్‌ వార్‌ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదకారిగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. కాగా ట్రేడ్‌ వార్‌ భయాలు 15 శాతం మేర పెరగడం గమనార్హం. అంతేకాకుండా గత 18 సర్వేలలో 16 సర్వేలు ట్రేడ్‌ వార్‌ అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు ప్రమాదం అని పేర్కొన్నాయి. వచ్చే 12 నెలల్లో నికరంగా 15 శాతం ఇన్వెస్టర్లు యుఎస్‌పై ‘ఓవర్‌ వెయిట్‌ను’ కలిగి ఉండాలని కోరుకుంటుండగా, 78 శాతం మంది ఈ ప్రాంతంపై అధికంగా అంచనా ఉందని అభిప్రాయపడ్డారు.



You may be interested

ప్రారంభంలో సూచీలు అక్కడక్కడే

Tuesday 20th August 2019

క్రితం రోజు గరిష్టస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు స్థిరంగా 37,400 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,055 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. జీ టెలి, ఇన్ఫోసిస్‌, హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌ షేర్లు స్వల్పలాభాలతో మొదలుకాగా, బ్రిటానియా, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో ఆరంభమయ్యాయి. 

11181 పాయింట్లు దాటితే బలమైన అప్‌మూవ్‌!

Monday 19th August 2019

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా నిఫ్టీ గతవారం ఎంత ప్రయత్నించినా తన 200 రోజుల డీఎంఏ స్థాయిని దాటలేకపోయిందని, ఈ స్థాయిని దాటితేనే బలమైన అప్‌మూవ్‌ ఉంటుందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రిసెర్చ్‌హెడ్‌ షబ్బీర్‌ కయ్యూమీ అభిప్రాయపడ్డారు. వీక్లీ చార్టుల్లో క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ పరిశీలిస్తే ప్రస్తుతానికి పతనానికి చెక్‌ పడినట్లు భావించవచ్చన్నారు. చార్టుల్లో కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, ఈ ప్యాట్రన్‌ పై అవధి 11170 పాయింట్ల వద్ద

Most from this category