News


నిఫ్టీ వృద్ధి అంచనాలు తగ్గించిన గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు

Wednesday 21st August 2019
Markets_main1566369042.png-27919

ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అనేకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫ్టీ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. దీంతో పాటు ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం ఈ సంస్థలు కట్‌చేశాయి. క్యు1లో అంచనాలకన్నా తక్కువగా ఎర్నింగ్స్‌ ఉండడంతో బ్రోకరేజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫీ​వృద్ధి అంచనాలు 31 నుంచి 25 శాతానికి పతనం కావచ్చని, వచ్చే ఏడాదికి ఈ అంచనా 22 శాతం ఉండొచ్చని క్రెడిట్‌ సూసీ తన  నివేదికలో పేర్కొంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నందున ఎర్నింగ్స్‌ అంచనాలకు మరింత డౌన్‌సైడ్‌ రిస్కు ఉంటుందని తెలిపింది. అయితే కొన్ని అంశాల్లో పురోగతి కనిపిస్తోందని, అయితే ఈ మార్పు పూర్తి కావడం ఎప్పుడన్నది ముఖ్యమని, ఇప్పటికైతే అలాంటి పాజిటివ్‌ టర్నింగ్‌ పాయింట్‌ కనిపించడం లేదని తెలిపింది. నిఫ్టీ ఎర్నింగ్స్‌ అంచనాలు 2015 తర్వాత కనిష్టాలకు చేరాయని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. సెన్సెక్స్‌ ఎర్నింగ్స్‌ అంచనాలను 25 నుంచి 20 శాతానికి తగ్గించింది. అదేవిధంగా రెండేళ్ల వార్షిక వృద్ధి రేటు అంచనాలను 2 శాతం మేర తగ్గించింది. ఫైనాన్షియల్స్‌, మెటీరియల్స్‌ తదితర రంగాల ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ రివిజన్స్‌ చూస్తున్నాయని వెల్లడించింది. అదేవిధంగా ఎకానమీలో జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.5నుంచి 6.3 శాతానికి, 2020- 21కి 7.2 నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశమున్నందున ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంబసీ రైట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లబ్ది పొందవచ్చని క్రెడిట్‌ సూసీ అంచనా వేసింది. 
 



You may be interested

గోల్డ్‌పై రిటర్న్‌లను అంచనావేయొచ్చు: డబ్యూజీసీ

Wednesday 21st August 2019

వడ్డీ రేట్లు ప్రతికూలంగా మారడంతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లు అనిశ్చితిలో ఉండడంతో గత 10 నెలల నుంచి బంగారం, ఇతర ప్రధాన ఆస్తుల కంటే సురక్షితంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యుఎస్(డబ్యూజీసీ), మేనేజింగ్ డైరెక్టర్ జోసెఫ్ కావటోని అన్నారు. బంగారం ధర ఈ పదినెలలో దాదాపు 25 శాతం పెరిగిందని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన మార్కెట్లలో, 70

సీజీ పవర్‌ దెబ్బతో యస్‌ బ్యాంక్‌, ఎంఎఫ్‌లు విలవిల!

Wednesday 21st August 2019

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యుషన్స్‌, ఖాతాలను తారుమారు చేయడంతో పాటు వేలకోట్ల రూపాయిల మనిలాండరింగ్‌కు పాల్పడిన విషయాలు బయటపడడంతో ఈ సంస్థకు రుణాలిచ్చిన యస్‌ బ్యాంక్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి సీజీ పవర్‌ సంస్థలో యస్‌ బ్యాంక్‌ 12.8 శాతం వాటాను ఆధినంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో 7.1 శాతం పతనమయ్యి బీఎస్‌ఈలో

Most from this category