News


గ్లెన్‌మార్క్‌కు రేటింగ్‌ జోష్‌..!

Monday 18th November 2019
Markets_main1574068363.png-29675

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరకు జోష్‌నిచ్చింది. ఫలితంగా సోమవారం ఇంట్రాడేలో షేరు 21శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ బీఎస్‌ఈలో 308.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ‘‘ఈ ఆ‍ర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి ఫలితాలను సాధించింది. అమెరికాలో అమ్మకాల వేగం మరింత పుంజు‍కుంటుంది. అయితే దేశీయ వ్యాపారం ఫార్మా పరిశ్రమ రేటు కంటే పెరుగుతూనే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మూడేళ్లలో మొదటిసారిగా ఈ క్వార్టర్‌లో అమ్మకాలు అధిక వృద్ధిని సాధించాయి. ఆర్థిక సంవత్సరం 20-22 ఈపీఎస్‌ను 3శాతం-22శాతానికి పెంచడట జరిగింది. . అయితే మీడియం-టర్మ్‌లో అధిక రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ వ్యయం అప్పులను గణనీయంగా తగ్గించే అవకాశం లేకపోవడం, ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ 11 రెట్లు అధికంగా ఉండటంతో పరపతి బ్యాలెన్స్ షీట్ ఆందోళనలు కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షేరు ‘‘బై’’ రేటింగ్‌ కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.350లు రూ.410లకు పెంచడటం జరిగింది’’ అని సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. బ్రోకరేజ్‌ సంస్థ షేరు అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌ ప్రారంభం నంచే కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో 21.50శాతం పెరిగి రూ.365.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు క్రితం ముగింపు(రూ.301.20)తో పోలిస్తే రూ.21శాతం లాభంతో రూ.364.10 వద్ద ట్రేడ్‌ ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.267.30లు, రూ.706.90లుగా నమోదయ్యాయి.You may be interested

మిడ్‌టర్మ్‌కు టాప్‌ 10 రికమండేషన్లు

Monday 18th November 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినందించే పదిషేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు.  రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ వికాస్‌ జైన్‌ సిఫార్సులు: 1. అంబుజా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 224. స్టాప్‌లాస్‌ రూ. 190. డైలీ చార్టుల్లో హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరిచింది. టర్నెరౌండ్‌కు రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తోంది.  2. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 218. దిగువన బహుళస్థాయి మద్దతు పొంది పాజిటివ్‌ బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. కీలక

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Monday 18th November 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం పెరిగింది. ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఎస్సార్‌ స్టీల్‌ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. అందులో ఒక్క ఎస్‌బీఐకు

Most from this category