News


గ్లెన్‌మార్క్‌ షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌..!

Monday 24th June 2019
Markets_main1561364098.png-26531

  • 6ఏళ్ల కనిష్టానికి పతమైన షేరు​

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేర్లకు యూఎఫ్‌ఎస్‌డీఏఏ షాక్‌ ఇచ్చింది. కంపెనీ ఇటీవల ఉపిరితిత్తుల వ్యాధి నివారణకు ర్యాల్ట్రిస్‌పై జనరిక్‌ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు యూస్‌ఎఫ్‌డీఏ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఔషధానికి సంబంధించిన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌లో, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాకల్టీస్‌లో ఒక్కొక్క లోపాన్ని గుర్తించి కంప్లీట్‌ రెస్పాస్‌ లెటర్‌(సీఆర్‌ఎల్‌) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ495.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ ఔషధాలకు సీఎల్‌ఆర్‌ను జారీ చేసిందనే వార్తలతో నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ కంపెనీ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తా‍యి. ఫలితంగా షేరు 8శాతం నష్టపోయి రూ.459.25ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర షేరు 6ఏళ్ల కనిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.500.20)తో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.461.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.459.25లు, రూ.711.55లుగా నమోదయ్యాయి. 



You may be interested

నవరత్నాల్లాంటి సిఫార్సులు

Monday 24th June 2019

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే సత్తా ఉన్న తొమ్మిది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 1. టిమ్‌కెన్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 655. ఇటీవలే నిరోధ శ్రేణిని మంచి వాల్యూంలతో బ్రేక్‌చేసింది. బ్రేకవుట్‌ తర్వాత మంచి కన్సాలిడేషన్‌ చూసి తిరిగి గతవారం బౌన్స్‌ చూపింది. ప్రస్తుతం స్వల్పకాలిక డీఎంఏస్థాయిలకు పైన ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. 2. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌:

నేడే జలాన్‌ ప్యానెల్‌ నివేదిక!

Monday 24th June 2019

ఆర్‌బీఐ మిగులు నిధులను క్రేంద్రానికి బదిలీ చేసేలా సిఫార్సులుంటాయని అంచనా ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటైన జలాల్‌ ప్యానెల్‌ సోమవారం నివేదిక సమర్పించనుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు మిగులు నిధులను(సుమారు లక్ష నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు) కేంద్రానికి ఇచ్చేందుకు ప్యానెల్‌ పచ్చజండా ఊపవచ్చని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిధులతో పీఎస్‌యూ బ్యాంకులను రీక్యాప్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విధంగా

Most from this category