News


స్టాక్‌ విలువపై దృష్ఠిపెట్టండి..ఆర్థిక అంచనాలపై కాదు!

Saturday 23rd November 2019
Markets_main1574489122.png-29810

-ప్రశాంత్‌ జైన్‌
జీడీపీ వృద్ధిరేటు తాత్కాలికంగా పడిపోయినంత మాత్రాన స్టాక్‌ మార్కెట్లను ప్రతికూల దృక్పథంతో చూడకూడదని దేశీయ స్టార్‌ ఫండ్‌ మేనేజర్‌, ఈ ఏడాదితో ఒకే ఫండ్‌ను 25 ఏళ్లు నిర్వహించిన ఘనతను సాధించిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు.   ‘జీడీపీ వృద్ధి రేటు  8 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. కానీ ఇది ఎల్లప్పుడు అక్కడే ఉండదు’ అని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈడీ, సీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. ‘వడ్డీ రేట్లు తగ్గితే ఈక్విటీల విలువ మంచి స్థాయిలో ఉండడానికి అధిక అవకాశాలుంటాయి. అందువలన జీడీపీ వృద్ధి రేటు 3 శాతం తగ్గినప్పటికి, ఈక్విటీల విలువ మంచి స్థాయిలో ఉండగలదు’ అని తెలిపారు. భవిష్యత్‌కు సంబంధించి ఆర్థిక వ్యవస్థ, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరెన్సీ, కమోడిటీ రేట్లుపై వేసే అంచనాలు చాలా వరకు తప్పడం తన సుదీర్ఘ అనుభంలో చూశానని అన్నారు. వీటికి బదులుగా ఇన్వెస్టర్లు తమ నియంత్రణలో ఉంచుకోగలిగే, మార్కెట్లను అంచనా వేయడానికి అధికంగా ఉపయోగపడే ‘ఏ విలువ వద్ద స్టాక్‌ ను కొనుగోలు చేశావు’ అనే అంశంపై దృష్ఠి పెట్టాలన్నారు. 
    వ్యవస్థలో తాత్కాలిక మందగమనం ఉన్నప్పటికి, దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంచి వాల్యుషన్‌ వద్ద ట్రేడవుతున్నాయని ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. వినియోగ రంగానికి చెందిన స్టాకులను మినహాయిస్తే, మిగిలిన రంగాల స్టాకులు వాటి దీర్ఘకాల సగటు కంటే తక్కువగా ట్రేడవుతున్నాయని తెలిపారు. కాగా ప్రశాంత్‌ జైన్‌ కాంట్రా ఇన్వెస్టింగ్‌ కంటే విలువాధారిత కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ‘విలువాధారిత ఇన్వెస్టింగ్‌ ప్రాధాన్యం ఇచ్చావంటే, నువ్వు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నావని అర్ధం’ అని తెలిపారు. తానెప్పుడు అర్ధవంతమైన, నాణ్యమైన వ్యాపారాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే ఇవెప్పుడు అధిక వాల్యుషన్‌ వద్ద అందుబాటులో ఉంటాయి’ అని అన్నారు. ‘బీపీసీఎల్‌ 2000 వ సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్‌ విలువతో అందుబాటులో ఉండేది. అదే విధంగా అశోక్‌ లేలాండ్‌ తన బ్యాలెన్ష్‌ షీట్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ కంటే తక్కువకు లభించేది’ అని పేర్కొన్నారు. పీఎస్‌యూ స్టాకులకు సంబంధిం‍చి కొన్ని మైనింగ్‌, ఆయిల్‌, గ్యాస్‌, నిర్ధిష్టమైన బ్యాంకులు, పవర్‌ సెక్టార్‌లో పీఎస్‌యూలు నిలకడైన వ్యాపార మోడల్‌ను కలిగివున్నాయి. అంతేకాకుండా ఇవి వాటి వాల్యుషన్‌ కంటే దిగువన ట్రేడవుతున్నాయి’ అని వివరించారు. 90 వ దశకంలో ఇండియా, చైనా తలసరి ఆదాయం ఒకే విధంగా ఉండేదని, కానీ ఇండియా సర్వీస్‌ సెక్టార్‌లో వృద్ధి చెందితే, చైనా మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌లో కొన్ని దశాబ్దాల వృద్ధిని సాధించిందని అన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌లో తయారిరంగానికి 10 శాతం కంటే తక్కువ వెయిటేజ్‌ ఉందని గుర్తుచేశారు. అయినప్పటికి ఇండియాలో కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో అవకాశాల టైం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
ప్రశాంత్‌ జైన్‌ ఎవరూ?  
ప్రశాంత్‌ జైన్‌, ఇండియా అతి పెద్ద ఈక్విటీ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బీఏఎఫ్‌(బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌)ను 1994 ఫ్రిబ్రవరి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్‌ను ముందు హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్‌గా పిలిచేవారు. అమలులోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్‌ 18.9 శాతం రిటర్న్‌ ఇచ్చింది. ఫండ్‌ సైజు కూడా ఈ కాలంలో అక్టోబర్‌ 31 సమయానికి రూ. 44,110 కోట్లకు పెరిగింది. ప్రశాంత్‌ జైన్‌ రూ. 18,507 కోట్లు విలువైన హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 ఫండ్‌, రూ. 23,440 కోట్ల విలువైన రూ. హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెండు ఫండ్స్‌ కూడా 90 వ దశకం నుంచి 18-19 శాతం రిటర్న్‌లను ఇచ్చింది. ప్రశాంత్‌ జైన్‌ టీవీల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికి, ఆయనకు మంచి ఫ్యాన్‌ పాలోయిం‍గ్‌ ఉంది. ఈయన పేరుంటే పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు చాలా మంది ఉన్నారు. You may be interested

స్వల్ప నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11914.50తో పోలిస్తే 6 పాయింట్లు నష్టంతో 11,920 వద్ద స్థిరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యుత్త ప్రదర్శన కారణంగా ఈ వారం నిఫ్టీ 12000 స్థాయిని​బ్రేక్‌ చేసింది. అయితే ఈ మేజిక్‌ మార్కుపై ముగియడంలో మాత్రం విఫలమైంది. వారం మొత్తంగా నిప్టీ ఇండెక్స్‌ 21 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్‌ మాత్రం 2 పాయింట్లు మాత్రమే పెరిగింది.

సందిగ్థ దశలో మార్కెట్‌!

Saturday 23rd November 2019

స్వల్పకాలానికి కన్సాలిడేషన్‌ లాంగ్‌టర్మ్‌ పాజిటివ్‌ జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అనలిస్టు వినోద్‌ నాయర్‌ దేశీయ మార్కెట్లు సందిగ్దంలో ఉన్నాయని, అందువల్ల సరైన దిశానిర్ధేశం లేకుండా కదులుతున్నాయని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. బలహీన గణాంకాలు, అధిక వాల్యూషన్ల నేపథ్యంలో సూచీలు కొంతకాలం కన్సాలిడేషన్‌ దశలోనే ఉంటాయన్నారు. సంవత్సరానికి నిఫ్టీ టార్గెట్‌ 12600 పాయింట్లుగా నిర్ణయించుకున్నామన్నారు. నిఫ్టీ ప్రస్తుతం ఏడాది ఫార్వర్డ్‌ పీఈ 26 రెట్ల వద్ద వద్ద ట్రేడవుతోందని చెప్పారు. అందువల్ల స్వల్పకాలానికి ముందుకు

Most from this category