వచ్చే బడ్జెట్ వరకు బేర్ మార్కెట్టే: అగర్వాల్
By Sakshi

వచ్చే బడ్జెట్ వరకు బేర్ మార్కెట్ కొనసాగుతుందన్న దానికి సిద్ధపడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ అగర్వాల్ అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు సౌకర్యంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో బేర్ మార్కెట్ మరీ అంత తీవ్రంగా ఉండదని, అదే సమయంలో ఇది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో తన విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. మార్కెట్లో కరెక్షన్ మరింతగా ఉంటుందా...? ఎఫ్‌పీఐలపై అధిక ఆదాయ పన్ను, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పన్ను పరంగా స్పష్టత చాలా అవసరం. ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే , 5 నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు ఇంకా వేగంగా వెళ్లాలంటే అది సాధ్యమే కానీ... ప్రభుత్వం నుంచి స్పష్టమైన పన్నుల విధానం అవసరం. చాలా స్థిరమైన, ఊహించతగినదిగా ఉండాలి. ఈ స్థాయిలో మిడ్, స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్మెంట్?
మార్కెట్లు కొంత బౌన్స్‌బ్యాక్ అయినా కానీ సెంటిమెంట్ చాలా బలహీనంగానే ఉంది. గత 12 నెలల్లో నిజమైన బేర్ మార్కెట్ ఇది. 2002-2003లో నిజమైన బేర్ మార్కెట్‌ను చూశాం. అమెరికాలో జంట టవర్ల ఘటన తర్వాత ఇది చోటు చేసుకుంది. రెండు సంవత్సరాలు మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడున్న ఇన్వెస్టర్లు, బ్రోకర్లు, ఫండ్ మేనేజర్లు బుల్ మార్కెట్ పిల్లల్లాంటివారు. వారు తీవ్రమైన బేర్ మార్కెట్‌ను చూడలేదు. 2008-09లో వచ్చింది బేర్ మార్కెట్ కాదు. అది పతనం మాత్రమే. ఎన్నో కోతలతో మరణం మాదిరిగా ఇది ఉంటుంది. ప్రతీ రోజూ నిరాశకు గురి చేస్తుంది. కనుక ప్రస్తుత బేర్ మార్కెట్ మరింత ఎక్కువగా, కనీసం ఏడాది పాటు, అంటే వచ్చే బడ్జెట్ వరకు ఉండొచ్చు. భారత్ సహా అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు సులభంగా మారుతున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి ద్రవ్య లేదా పరపతి చర్యలు సాయం చేయవచ్చు. మార్కెట్ వ్యాల్యూషన్ జీడీపీలో 70 శాతంగా ఉంది. ఇది ఏమంత ఎక్కువ కాదు. కనుక కరెక్షన్ ఈ స్థాయి నుంచి ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కరెక్షన్ ఎక్కువ సమయం పాటు కొనసాగొచ్చు.
ఈ తరహా నిరాశావాదం ఉన్నప్పుడు ఇండెక్స్ కనిష్టానికి వెళుతుంది కదా అని వేచి చూడకూడదు. ఇప్పటికే బోటమ్ అవుట్ అయిన స్టాక్స్ లేదా కనిష్టాలకు దగ్గర్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫైనాన్షియల్స్, ప్రైవేటు ఇన్సూరెన్స్, ఆటోమోటివ్స్ పట్ల సానుకూలంగా ఉన్నాం. ఇవి ఎక్కువగా దిద్దుబాటుకు లోనయ్యాయి. ఎంపిక చేసిన కన్జ్యూమర్ కంపెనీల పట్ల కూడా అనుకూలంగా ఉన్నాం. మేం కేవలం 20-25 కంపెనీలనే పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్నాం. 2,500 కంపెనీల్లో మిగిలిన వాటి పట్ల ప్రతికూలంగానే ఉన్నాం.
You may be interested
71 కి చేరువలో రూపీ
Wednesday 7th August 2019రూపీ డాలర్ మారకంలో బుధవారం(అగష్టు 7) 15 పైసలు బలహీనపడి 70.96 వద్ద ప్రారంభమైంది. ఆర్బిఐ ద్రవ్యపరపతి సమావేశం ఈ రోజు జరగనుండడంతో పాటు, విదేశి నిధుల ఔట్ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.81 వద్ద ముగిసింది. దీంతో గత వరుస నాలుగు సెషన్ల నుంచి రూపీ డాలర్ మారకంలో పడిపోయినట్టయ్యింది. మొత్తం మీద ఈ నాలుగు సెషన్లలో రూపీ డాలర్
జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ నుంచి ఎన్సీడీ ఇష్యూలు
Wednesday 7th August 2019జేఎం ఫైనాన్షియల్, ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) సంస్థలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూలను చేపట్టాయి. ఈ రెండూ మంగళవారం ఆరంభమయ్యాయి. ఇందులో ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీ ఇష్యూ ఈ నెల 30న ముగుస్తుంది. జేఎం ఫైనాన్షియల్ ఎన్సీడీ ఇష్యూ మత్రం సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు కూడా ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థలు కావడం గమనార్హం. ఇందులో ఐఐఎఫ్ఎల్ 10.50 శాతం, జేఎం ఫైనాన్షియల్ 10.40