STOCKS

News


మరో 4 నాలుగు నెలల్లో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

Saturday 8th February 2020
news_main1581159073.png-31630

కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి పూర్తి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై రాబోయే రెండు, మూడు, నాలుగు నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వెజర్‌ సందీప్‌ సబర్వాల్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ ప్రస్తుతం ఆర్‌బీఐ పాలసీ విధానానికి అనుగుణంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. అలాగే సందీప్‌ ​ ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు., ఆర్థిక వ్యవస్థ, రియల్టీ, షుగర్‌ షేర్లపై తన అభిప్రాయాలను ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.  

అందుకే మార్కెట్లో రికవరీ జరిగింది
బడెట్జ్‌ రోజున మార్కెట్‌ భారీ నష్టాల్ని చవిచూసినప్పటికీ.., వెను వెంటనే రికవరీ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత శుక్రవారం(జనవరి 31) రాత్రి అమెరికా మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. మరుసటి రోజు(ఫిబ్రవరి 1న) శనివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోవడంతో భారత మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. అనంతరం ప్రపంచ మార్కెట్లలో భారీ రికవరీ అయ్యాయి. అమెరికా మార్కెట్లు ప్రతిరోజూ కొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. మరోవైపు కరోనా వైరప్‌ ప్రభావంతో చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు చైనా వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచడం, యుఎస్ దిగుమతులపై సుంకాలను తగ్గింపు లాంటి చర్యలు తీసుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. సాధారణంగా భారత్‌లాంటి వర్దమాన దేశాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను అనుసరిస్తుంటాయి. అందులో భాగంగానే మన మార్కెట్లలో రికవరీ జరిగింది.  

 కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం
కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భారత ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చైనా నుంచి అటో దిగుమతులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొన్ని మోడళ్ల తయారీ నిలిపివేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ప్రకటించింది. ఔషధ ముడి పదార్థాల దిగుమతులు ఆగిపోవడంతో పారాసిటమాటల్‌ లాంటి ఔషధ ధరలు 10రోజుల్లో రెట్టింపు అయ్యాయి. సోలార్‌ పవర్‌ డెవలపర్స్‌ కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు చాలా రంగాల్లో మందగమనం కన్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థపై రాబోయే రెండు, మూడు, నాలుగు నెలల్లో కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 

రియల్‌ ఎస్టేట్‌ షేర్ల ర్యాలీ ఈ ఏడాదిలోనూ కొనసాగుతుంది 
గతేడాదిలో రియల్‌ ఎస్టేట్‌ షేర్ల ర్యాలీ జరిగింది. ఈ ఏడాదిలో అదే ట్రెండ్‌ కొనసాగవచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించినపుడు ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు నేరుగా చాలా ప్రయోజనం పొందుతాయి. గత ఏడాదిలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను చాలాసార్లు తగ్గించింది. తాజాగా (ఫిబ్రవరి 06న) ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీనికితోడు వృద్ధి జోరును పెంచడానికి సర్దుబాటు విధానాన్ని అనుసరిస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో రియల్‌ ఎస్టేట్‌ షేర్లు కొనసాగే అవకాశం ఉంది.

డీఎల్‌ఎఫ్‌ షేరు ఎంపిక మంచిదే
రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని డీఎల్‌ఎఫ్‌ షేరును కొనుగోలు మంచిదే. త్రైమాసిక ఫలితాలు గొప్పగా లేవు. బాల్సెన్స్‌ షీటును పరిశీలిస్తే అప్పులు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ ధీర్ఘకాలిక దృష్ట్యా డీఎల్‌ఎఫ్‌ షేరు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడం ఉత్తమం. 

షుగర్‌ షేర్లలో ఇంకా సత్తా ఉంది
షుగర్‌ షేర్లలో ర్యాలీ చేసే సత్తా ఇంకా ఉంది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా 11-12 మిలియన్ టన్నుల భారీ లోటు ఉంటుందని అంచనా. అయితే దేశీయంగా ఉత్పత్తి బాగానే ఉంటుంది. రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రెండేళ్ల చక్కెర కంపెనీలకు ఏ మాత్రం ఢోకా లేదు. You may be interested

లోకల్‌ ఓకే.. కరోనానే రిస్క్‌..!

Monday 10th February 2020

బడ్జెట్‌ ముగిసింది. డిసెంబర్‌ క్వార్టర్‌ కంపెనీల ఫలితాల విడుదల సీజన్‌ కూడా చివరి దశకు చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం విషయంలో డీల్‌ కుదరగా, అమెరికా ఉత్పత్తులపై పెంచిన టారిఫ్‌లను చైనా కొంత మేర తగ్గించడం కూడా జరిగిపోయింది. దేశీయంగా ప్రతికూల వార్తలేవీ ఇప్పటికైతే లేవు. అంతర్జాతీయంగానూ పరిస్థితులు ఆశావహంగా మారుతున్న రుణంలో కరోనా వైరస్‌ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వైరస్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

మరింత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Saturday 8th February 2020

శనివారం ఇంధన ధరలు భారీగా తగ్గాయి.  కరోనా వైరస్‌ ప్రభావంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ డిమాండ్‌ తగ్గడంతో  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఒక శాతంపైగా తగ్గాయి.  దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.72.45గా ఉంటే, ముంబైలో రూ.78.11, కోలకతాలో రూ.75.13, చెన్నైలో రూ.75.27 గా  ధరలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలో లీటర్‌ డీజీల్‌ ధర 65.43గా ఉంటే ముంబై లోరూ.68.57, కోల్‌కతాలో రూ.67.79, చెన్నైలో రూ.69.10గా

Most from this category