News


నాణ్యమైన మిడ్‌క్యాప్‌లను ఎంచుకోండి: దేవన్‌ చోక్సి

Wednesday 10th July 2019
Markets_main1562737614.png-26939

  • బడ్జెట్‌లో ఇచ్చిన హామీల అమలుపై మార్కెట్లో అనుమానాలు
  • సమీప భవిష్యత్తు ఆదాయాలు తగ్గవచ్చు
  • వృద్ధి రేటు తగ్గితే లార్జ్‌క్యాప్‌ స్టాకులు పడిపోయే అవకాశం: దేవన్‌ చోక్సి

  వాల్యుషన్లు దిద్దుబాటు గురవుతున్నపుడే పోర్ట్‌పోలియోలను సిద్ధం చేసుకోవాలని కేఆర్‌ చోక్సె ఇన్వెస్ట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవన్చో‌ చోక్సీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

అనుమానంలో మార్కెట్లు
మార్కట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. మార్కెట్లు ఎటువైపు వెళతాయో చెప్పడం కష్టం కానీ ప్రజలు అనుమానస్పదంగా ఉన్నారు. బడ్జెట్‌ అర్థవంతగా ఉంది అయినప్పటికి ప్రజలతో మాట్లడుతున్నప్పుడు బడ్జెట్‌లో ఏ విషయాలున్నాయి అవి ఎప్పటికి అమలవుతాయో? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిరాశవాదంతో ఉన్నారని కూడా అనుకోవడం లేదు. వారు ప్రోత్సాహాకాలు అందుతాయా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌, ఆటో మొబైల్స్‌ రంగానికి చేయూతగా  కొన్ని ఉద్దీపన పథకాలుంటాయని మార్కెట్‌ ఆశించింది. కానీ వీటి గురించి బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్థావన లేదు. బడ్జెట్‌ వలన దీర్ఘకాలంలో ఈ రంగాలు కోలుకునే అవకాశం ఉన్నప్పటికి ప్రస్తుతం మాత్రం ఇవి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి.

మార్కెట్ల వాల్యుషన్లు బాగున్నాయి...
      ముందు ముందు మార్కెట్లు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది.  ఎప్‌ఐఐల పెట్టుబడులు తగ్గడం వలన మార్కెట్లు నష్టపోతే ప్రజలు మార్కెట్ల సామర్ధ్యాన్ని అనుమానిస్తారు. ఇటువంటి మార్కెట్లు దీర్ఘకాల పెట్టుబడిదారులను ఆకర్షించలేవని భాదపడతారు. కనుక నియంత్రణ సంస్థలు కూడా మార్కెట్ల సామర్ధ్యం పెరిగేందుకు సరియైన చర్యలను తీసుకోవాలి.  ఈ పరిస్థితుల నుంచి మార్కెట్లు ఎలా బయటపడతాయో చూడాలి. మార్కెట్లు వాల్యుషన్ల పరంగా బలంగా ఉన్నాయి. కొద్ది కాలంలో సమస్యలున్నప్పటికి మార్కెట్ల విలువ బాగుండడం సానుకూల అంశం. మార్కెట్లు ఇన్వెస్టర్లను తిరిగి ఆకర్షించగలగాలి. ఇన్వెస్టర్లు కంపెనీల ఔట్‌ లుక్‌, ఆదాయ వృద్ధికి ఆకర్షితులవుతారు. ఒక వేళ కంపెనీల ఆదాయ వృద్ధి కూడా పడిపోతే మార్కెట్లు నిరుత్సాహాంలో ఉన్నాట్టే. అంతే కాకుండా అవి తమకు తాముగా దిద్దుబాటుకు గురవుతాయి కూడా. 
    మార్కెట్లపై విశ్వాసాన్ని పెంచి తిరిగి పెట్టుబడులు పెట్టేటట్టుగా చేయాలి. కానీ దురదృష్ఠవశాత్తు మన మార్కెట్లలలో డెరివేటివ్‌ డెట్‌లు ఎక్కువగా ఉన్నాయి. నగదు మార్కెట్ల పరిమాణం వేగంగా తగ్గిపోతుం‍ది. నగదు మార్కెట్లో అనిశ్చితి నెలకొని ఉంది. బహుశ మార్కెట్లు బలహీనతకు ఇదొక కారణం కావచ్చు. ఈ బలహీనతలను తొలగిస్తేనే మార్కెట్లు తిరిగి తమ పూర్వపు సామర్ధ్యన్ని పొందగలవు. 

నాణ్యమైన మిడ్‌ క్యాప్‌లు ఓకే..
    ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులలో కూడా లార్జ్‌ క్యాప్‌లు రాణించగలవని కొంత మంది నమ్ముతున్నారు. అందువలన పెట్టుబడుల పరంగా లార్జ్‌క్యాప్‌లు రక్షణత్మాకంగా ఉండవచ్చు. కానీ వృద్ధి రేటు తగ్గితే ఇవి దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది.  వాల్యుషన్ల అధారంగా కొన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల స్టాకులను హోల్డ్‌లో ఉంచవచ్చు. సమస్యంతా మిడ్‌ క్యాప్‌ స్మాల్‌ క్యాప్‌లోనే ఉంది. మార్కెట్‌లో పాల్గొనే వాళ్లలో  అధిక భాగం ఈ రంగాలలోనే ఇన్వెస్ట చేస్తున్నారు. ఒక వేళ ఈ రంగాలు నష్టపోతే పెట్టుబడిదారుల సంపద చాలా మట్టుకు హరించుకుపోతుంది. దురదృష్ఠవశాత్తు కొన్ని మంచి వాల్యుషన్లు కలిగిన మిడ్‌ క్యాప్‌ కంపెనీలు కూడా ప్రస్తుత పరిస్థితులలో  నష్టపోతున్నాయి. వాటి వాల్యుషన్లు, సామర్ధ్యం బాగున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడం వలన వచ్చే ఆరు నెలలో అధిక లాభాలు ఉండకపోయినప్పటికి నెమ్మదిగా ఇవి మంచి రిటర్న్‌లను ఇచ్చే అవకాశం ఉంది. 

 You may be interested

4రోజూ కొనసాగుతున్న పసిడి పతనం

Wednesday 10th July 2019

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు సందేహాలతో పసిడి పతనం కొనసాగుతుంది. వరుసగా 4రోజూ నష్టాల బాట పట్టింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు క్షీణించి 1,395.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో శుక్రవారం అమెరికా జూన్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. దీంతో ఈ జూలై 30-31 తేదిల్లో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గింపు మార్కెట్‌ వర్గాల్లో

68.61 వద్ద ప్రారంభమైన రూపీ

Wednesday 10th July 2019

 రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు బలపడి 68.61 వద్ద బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభమైంది. డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో 18 పైసలు బలహీనపడి 68.84 ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. చమురు ధరలు తగ్గడంతో రూపీ బలపడి 68.67 వద్ద ముగిసింది. 

Most from this category