News


ఆరు నెలల వరకు రాబడులు ఆశించొద్దు..!

Tuesday 9th July 2019
Markets_main1562695507.png-26932

మార్కెట్లో సెంటిమెంట్‌ చాలా బలహీనంగా ఉందన్నారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే. బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొన్న వాటి అమలు సాధ్యమేనా అన్న విషయమై మార్కెట్‌కు సందేహాలున్నట్టు చెప్పారు. సమీప కాలంలో కంపెనీల ఎర్నింగ్స్‌ ఆశాజనకంగా ఉంటాయన్నది అనుమానమేనన్నారు. వృద్ధి తక్కువగా ఉంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో దిద్దుబాటు జరగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

‘‘ఆర్‌బీఐ ఎన్నో విడతలు వడ్డీ రేట్లను తగ్గించినా కానీ, బ్యాంకులు వాటిని కస్టమర్లకు బదలాయించలేదు. ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ సమావేశాలు నిర్వహిస్తున్నా గానీ, బ్యాంకులు రేట్ల తగ్గింపును బదలాయించడానికి నిరాకరిస్తున్నాయి. ఇదే తరహా పరిస్థితి చాలా విభాగాల్లో, అంటే బడ్జెట్లో పేర్కొన్న పలు ప్రతిపాదనల విషయంలోనూ నెలకొని ఉంది’’ అని దేవేన్‌ చోక్సే తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్లో దిద్దుబాటు ఉండొచ్చన్నారు. రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌కు బడ్జెట్లో తాయిలాలు ఆశించినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పారు. దీర్ఘకాలంలో కొంత ఉపశమనం కల్పించారని, ఇవే మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. 

 

ఒకవేళ కరెక్షన్‌ లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో చోటు చేసుకుంటే ఒత్తిడి నెలకొని, ఇన్వెస్టర్లు మార్కెట్‌ను వీడే ప్రమాదం ఉందన్నారు చోక్సే. ఇప్పటికైతే అధిక శాతం మంది ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తట్టుకుని నిలబడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియో పరంగా చూస్తే లార్జ్‌క్యాప్‌ కాస్త సురక్షిత బెట్స్‌ అన్నారు. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెద్ద కరెక్షన్‌ వస్తుందని తాను అనుకోవడం లేదని, మరీ అయితే, రాబడులు రాని పరిస్థితి ఉండొచ్చన్నారు. లార్జ్‌క్యాప్‌ మినహా మిగిలిన స్టాక్స్‌ వాటి అసలైన వ్యాల్యూషన్ల వద్దే ఉన్నట్టు చెప్పారు. ‘‘మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఇప్పటికే చాలా ఎక్కువగా నష్టపోయి ఉన్నాయి. ఇదే ఎక్కువ ఇబ్బంది కలిగించే అంశం. కానీ, అదే సమయంలో మార్కెట్‌లో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టి ఉన్నారు. వీరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇవి ఇంకా పడిపోతే ఇన్వెస్టర్ల సంపద తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఆందోళన కలిగించే అంశం’’ అని దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ కంపెనీలు కొన్ని తమ వాస్తవిక విలువల వద్దే ఉన్నట్టు చెప్పారు. మంచి వృద్ధి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులుగా మారే ప్రమాదం లేకపోలేదన్నారు. వచ్చే ఆరు నెలల పాటు రాబడులు రాకపోయినా ఫర్వాలేదనుకుంటే, నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఏరికోరి ఎంపిక చేసుకోవచ్చని, దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశాలు ఉంటాయని సూచించారు. You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మన్‌పసంద్‌ బేవరీజెస్‌:- కంపెనీపై జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేయడంతో కంపెనీకి ఆడిటర్‌ సేవలు అందిస్తున్న మెహ్రా గోయల్‌ అండ్‌ కో. రాజీనామా చేసింది.  కేఆర్‌బీఎల్‌:- కంపెనీ బ్యాంకు రుణసౌకర్య సదుపాయాలకు ఇక్రా రేటింగ్‌ సంస్థ ఎఎ(స్థిరత్వం) నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లలలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ తన ఫిర్యాదులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సెబీకి లేఖ రాసారు.

రోజంతా హెచ్చుతగ్గులు...ఫ్లాట్‌ ముగింపు

Tuesday 9th July 2019

రెండు రోజుల భారీ పతనం అనంతరం మార్కెట్‌ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు అక్కడక్కడే క్లోజయ్యాయి.  సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 38,731 వద్ద, నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 11,556 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆర్థిక, మీడియా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 321 పాయింట్ల

Most from this category