News


కొన్ని షేర్ల బుల్‌ రన్‌ ఆశ్చర్యకరం

Saturday 22nd February 2020
Markets_main1582353188.png-32005

పెట్టుబడులకు వ్యక్తిగత వ్యూహాలు అనుసరించవలసిందే
షేర్ల విలువ, ధర, మార్కెట్‌ ధోరణి వంటివి గమనించాలి
- కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా 

షేరు ధరకు లేదా విలువకు ప్రాధాన్యత ఇవ్వకుండా మార్కెట్లో కొనుగోళ్లు కనిపిస్తున్నంతవరకూ ఏదైనా ఒక కంపెనీ షేరు ధర పెరుగుతూనే ఉంటుందని కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇంతక్రితం హర్షద్‌ మెహతా కుంభకోణం బయటపడకముందు దేశీ మార్కెట్లో నమోదైన బుల్‌రన్‌లో కనిపించినట్లు పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మిడ్‌ క్యాప్స్‌, డీమార్డ్‌ షేరు పరుగు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

అటూఇటుగా..
ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లు క్యూలెస్‌గా నడుస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు వేచి చూస్తున్నట్లుగా ఉంది. అయితే కరోనా వల్ల దేశీయంగా లబ్ది చేకూరుతోంది. చమురు ధరలు దిగిరావడం, ఆర్థిక వృద్ధికి దన్నుగా పలు దేశాలు అనుసరిస్తున్న లిక్విడిటీ విధానాలు, తగ్గుతున్న వడ్డీ రేట్లు వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. చైనాలో ప్రస్తుతం తలెత్తిన సరఫరా అవాంతరాల నేపథ్యంలో పలు గ్లోబల్‌ దిగ్గజాలు ఉత్పాదక కేంద్రాలను తరలించే యోచన చేస్తున్నాయి. ఉదాహరణకు 62 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ కలిగిన కొరియన్‌ దిగ్గజం శామ్‌సంగ్‌.. వియత్నాం నుంచి 30 శాతం ఉత్పత్తిని సాధిస్తోంది. ఇది వియత్నాం జీడీపీలో 28 శాతంకాగా.. కరోనా కారణంగా ఉత్పత్తి తరలిపోతే.. వియత్నాం వంటి చిన్న దేశాలకు ఇది భారంగా పరిణమించవచ్చునంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి 10-12 శామ్‌సంగ్‌ తరహా కంపెనీలు దేశానికి తరలివస్తే.. ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. కరోనా వైరస్‌ను అంతర్జాతీయంగా ఏస్థాయిలో కట్టడి చేయగలరన్న అంశాలతోపాటు.. ఈ ప్రభావం దేశానికి ఎంతమేర లబ్ది చేకూరచ్చగలదన్న అంచనాలు సైతం​మార్కెట్లను ప్రభావితం చేయగలవు. 

ఫలితాల ఎఫెక్ట్‌ నిల్‌
నిజానికి బడ్జెట్‌ రోజు అమెరికా, చైనా మార్కెట్ల పతనం‍ దేశీయంగా ప్రభావం చూపింది. తదుపరి మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. కాగా.. ఇటీవల మార్కెట్లలో కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్‌లోకే పెట్టుబడులు తరలి వస్తున్నాయి. దీంతో ఈ కౌంటర్లలో సప్లై సరిపోక షేర్ల ధరలు ఏకధాటిగా పెరుగుతూ పోతున్నాయి. వెరసి గత పదేళ్ల సగటును పరిగణిస్తే కొన్ని నిఫ్టీ షేర్లు 100 శాతం ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. షేర్ల ధరలు లేదా విలువను పెడచెవిన పెడుతూ పాసివ్‌ మనీ కొన్ని కౌంటర్లకే పరిమితమవుతూ వస్తోంది. దీంతో ఈ కంపెనీల ఫలితాలకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. అయితే గత ఐదేళ్ల కాలం నుంచి చూస్తే మిడ్‌ క్యాప్‌ మార్కెట్‌ అటూఇటుగానే ఉంది. కొన్ని కంపెనీలు మెరుగైన పనితీరును చూపినప్పటికీ పెద్దగా పెట్టుబడులను ఆకర్షించుకోకపోవడం గమనార్హం!  అయితే ఫండ్‌ మేనేజర్‌గా, ఇన్వెస్టర్‌గా చెప్పాలంటే.. మార్కెట్‌(పాసివ్‌ మనీ) ధోరణిని అనుసరించాలా లేక కంపెనీల ఫలితాలు, విలువ ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయాలా అనే అంశాలను బ్యాలన్స్‌ చేసుకోవలసి ఉంటుంది. 

డీమార్ట్‌ జోరు..
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న డీమార్ట్‌ విషయానికి వస్తే..  బిజినెస్‌లో వృద్ధి, గవర్నెన్స్‌, నిర్వహణ, ప్రమోటర్లు కంపెనీ బలంగా పేర్కొనవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులపరంగా పలువురు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అయితే షేరు ధర ప్రస్తుతం ఫండమెంటల్స్‌ను మించి పరుగుతీస్తోంది. ఇందుకు ఫ్లోటింగ్‌ స్టాక్‌  తక్కువకావడం ప్రభావం చూపుతోంది. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినవారు విక్రయాలకు ఆసక్తి చూపకపోవడం కారణమవుతోంది. ఇటీవల ముగిసిన క్విప్‌, ఓఎఫ్‌ఎస్‌లకంటే ముందుగా చూస్తే.. ఒకే ఇన్వెస్టర్‌  ముప్పావు వంతు వాటా కలిగి ఉన్నారు. కాగా.. షేరు విలువ, లేదా ధర వంటివి చూడకుండా అన్నివైపుల నుంచీ పెట్టుబడులు ఒకే కౌంటర్‌వైపు మరలితే.. ఆ షేరు భారీ ప్రీమియానికి చేరుతుంది. ఇంతక్రితం హర్షద్‌ మెహతా బుల్‌రన్‌లో ఒక సిమెంట్‌ షేరు ఐదంకెలకు చేరుకోగా.. 2000లో వచ్చిన టెక్నాలజీ, మీడియా, టెలికం బూమ్‌లోనూ కొన్ని స్టాక్స్‌ అత్యంత భారీగా పరుగుతీశాయి. కనుక ఇన్వెస్టర్లు మార్కెట్‌ తీరు, షేరు విలువ, ఫలితాలు వంటివి పెట్టుబడులకు పరిగణించడం మేలు. 

ఇకపై ఎలా?
ఈటీఎఫ్‌ తదితర పెట్టుబడులు లార్జ్‌ క్యాప్స్‌లోకే ప్రవహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న అంశం​అతిపెద్ద ప్రశ్నగానే కనిపిస్తోంది. ఆర్జనలకు మించి కొన్ని కంపెనీల షేర్లు పరుగుతీస్తున్న నేపథ్యంలో మార్కెట్‌ ధోరణినే అనుసరించడం ఎంతవరకూ సబబు అనేది ఇన్వెస్టర్లు వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయించుకోవలసి ఉంటుంది. పాసివ్‌ మనీ కొన్ని కౌంటర్లవైపే చూస్తున్నంత కాలం ఈ స్టాక్స్‌ ర్యాలీ చేస్తూనే ఉంటాయి. ఇది బబుల్‌ క్రియేటవుతున్న సంకేతమనుకుంటే.. ఇది ఎప్పుడు బరస్ట్‌ అవుతుందన్న అంశం ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ర్యాలీ చేస్తున్న పలు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌.. లాభాలతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని మల్టీనేషనల్‌ కంపెనీల ప్రమోటర్లు దేశీ అనుబంధ సంస్థలలో వాటాలను తగ్గించుకోవడం లేదా.. విక్రయించేందుకు ఆసక్తి చూపవచ్చు. తద్వారా మాతృ సంస్థల ప్రయోజనాలకు వినియోగించే యోచన చేయవచ్చు. ఇలాంటి పరిస్థితులు తలెత్తేవరకూ కొన్ని లార్జ్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగుతూనే ఉండవచ్చు! వెరసి ఇకపై ఇన్వెస్టర్లు మార్కెట్‌ ధోరణి అనుసరించడం లేదా షేరు ధర, విలువ, కంపెనీ ఫలితాలు వంటి అంశాలను పరిగణించడం వంటి విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందే. పోర్ట్‌ఫోలియో కేటాయింపులలో లార్జ్‌ క్యాప్స్‌, మొమెంటమ్‌ స్టాక్స్‌, మిడ్‌ క్యాప్స్‌నకు ప్రాధాన్యత ఇచ్చే అంశంలో జాగ్రత్తతోకూడిన వ్యూహాలను అమలు చేయవలసి ఉంటుంది.  

అటూఇటుగా
ఓవైపు గత మూడేళ్లలో జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్లను అధిగమించగా.. ఐఐపీ క్షీణపథంలో సాగుతోంది. జనవరిలో ఆటో విక్రయాలు 13 శాతం నీరసించాయి. గరిష్టస్థాయిలతో పోలిస్తే రియల్టీలో వ్యక్తిగత పెట్టుబడులు 50 శాతం వెనకడుగులో ఉన్నాయి. అయితే కొన్ని రంగాలలో ఉత్పత్తి, విద్యుత్‌ వినియోగం మెరుగుపడింది. ఇవన్నీ మిశ్రమ సంకేతాలనిస్తున్నాయి. ఇటీవల ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై జీడీపీ నెమ్మదిగా బలపడే అవకాశముంది. ఇందుకు ఇటు ప్రభుత్వం, అటు ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు దోహదం చేసే వీలుంది.You may be interested

ప్రముఖ బ్రోకరేజ్‌ల నుంచి టాప్‌ సిఫార్సులు

Saturday 22nd February 2020

బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌ షేరు పేరు: ధనుక అగ్రిటెక్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.635 విశ్లేషణ: ఈ క్యూ3 కంపెనీ మిశ్రమ ఫలితాలను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం 2021లో కంపెనీ ఆదాయం 7శాతం, ఈబిటా 10శాతం, నికరలాభం 11శాతం వృద్ధిని సాధిస్తుంది. అలాగే ఆర్థిక సంవత్సరం 22లో ఆదాయం 7శాతం, ఈబిటా 7శాతం, నికరలాభం 0.8శాతం వృద్ధిని అందుకుంటుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. వచ్చే రెండేళ్లలో వార్షిక ప్రాతిపదికన 7శాతం వృద్ధిని

టెక్నికల్స్‌తో ఇబ్బందా?.. ఇలా చేయండి...

Saturday 22nd February 2020

అనలిస్టు సీకే నారాయణ్‌ సూచనలు టెక్నికల్‌ విశ్లేషణ నేర్చుకునేవాళ్లు వివిధ రకాల సాధనాలను విశ్లేషించడం ద్వారా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్ని పుస్తకాలు చదివి ఎన్ని టెక్నికల్స్‌ పరిశీలించినా చివరకు అవన్నీ స్వల్ప వ్యాలిడిటీ ఉన్నవేనని అర్ధమవుతుంది. అయితే వీటిలో కొన్ని దీర్ఘకాలిక వాలిడిటీ ఉంటుందని మనం భావిస్తుంటాం. మనం నేర్చుకునేటప్పుడే కొన్ని టెక్నికల్స్‌పై గురి ఎక్కువగా పెంచకుంటాం. ఇక అనాలసిస్‌లో భాగంగా ఎవరమైనా ముందుగా చార్టుల విశ్లేషణ చేస్తారు. ఇందులో

Most from this category