News


ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ..విశ్లేషకులు ఏమంటున్నారు?

Saturday 30th November 2019
Markets_main1575094889.png-29978

దేశ ఆర్థిక వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవ్వడం గమనార్హం. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. సెప్టెంబర్‌ త్రైమాసికానికిగాను దేశ ఆర్థిక డేటాపై వివిధ ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అభిప్రాయాలు..

అమర్‌ అంబాని, సీనియర్‌ ప్రైసిడెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ హెడ్‌, యస్‌ సెక్యురిటీస్‌
ఆర్థిక సంవత్సరం ద్వితియ త్రైమాసికానికి చెందిన జీడీపీ డేటా మా అంచనాలకు అనుగుణంగానే ఉంది. దేశ ఆర్థిక డేటా బలహీనంగా ఉంటుందనే అంచనాలతో, గత కొన్ని సెషన్‌లో మార్కెట్‌ కొంత బలహీనంగా కదిలింది. జీడీపీ డేటా తగ్గడంతో సోమవారం సెషన్‌లో మార్కెట్లు నెగిటివ్‌లో కదిలే అవకాశం ఉంది. కానీ ఇది మధ్య కాలానికిగాను మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయదు. మొత్తం ఆర్థిక సంవత్సరం 2020కి గాను దేశ జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నాం. ఇది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ 135 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. ఈ డిసెంబర్‌లో ఇంకో 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపోరేటును 4.90 శాతానికి తగ్గిస్తుందని ఆశిస్తున్నాం. ముందుకేళ్లే కొద్ది దేశ వృద్ధికి ద్రవ్య విధానాల మద్ధతు అవసరం. ఈ ఏడాది, వచ్చే ఏడాదికిగాను ద్రవ్యలోటును ‍ ప్రభుత్వం అధిగమిస్తుందని అంచనావేస్తున్నాం. 

మడన్‌ సబ్నవిస్‌, ప్రధాన ఆర్థికవేత్త, కేర్‌ రేటింగ్స్‌
అంచనావేసినట్టుగానే జీడీపీ వృద్ధి 4.50 శాతంగా నమోదైంది. ప్రస్తుతం జీడీపీ బాటమ్‌ఔట్‌ అయ్యిందని అంచనావేస్తున్నాం. వచ్చే త్రైమాసికాలలో జీడీపీ డేటా మెరుగుపడుతుంది. 

దీప్తి మేరీ మాథ్యు, ఆర్థిక వేత్త, జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌
మార్కెట్‌ అంచనావేసినట్టుగానే దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసింలో నమోదైంది. ఐఐపీ(ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ ప్రోడెక్సన్‌), ఎలక్ట్రిసిటీ వినియోగం నుంచి ప్రధాన ద్రవ్యోల్బణం వరకు మొత్తం సూచీలు, దేశ జీడీపీ ఇంకా పునరుద్ధరణకు సిద్ధం కాలేదనే సంకేతాలను ఇచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది వినియోగం మందగించడం. ఇది పెట్టుబడులు పుంజుకోడానికి చాలా కీలకం. పీఎఫ్‌సీఈ(ప్రైవేట్‌ ఫైనల్‌ కన్జంప్సన్‌ ఎక్సిపెండీచర్) ఏడాది ప్రాతిపదికన 9.7 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. ఆర్‌బీఐ మరోమారు వడ్డీరేట్ల ఈ డిసెంబర్‌లో తగ్గిస్తుందని అంచనావేస్తున్నాం.


అనఘ దియోధర్‌, ఆర్థికవేత్త, ఐసీఐసీఐ సెక్యురిటీస్‌
బలహీన వృద్ధి కదలిక భయాలను ప్రస్తుత జీడీపీ డేటా ఖరారు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక చర్యల ప్రభావం ద్వితీయార్ధంలో కనిపిస్తుంది. అయినప్పటికి స్థూల ఆర్థిక డేటాను గమనించాలి. అక్టోబర్‌ నెలలో ప్రధాన రంగాల పనితీరు మందగించింది. అందువలన బలహీన ఆర్థిక వ్యవస్థ క్యూ3 మొదటి నెలలో కూడా చూడొచ్చు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయినప్పటికి ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం తీసుకునే ద్రవ్య పాలసీల ప్రభావం వృద్ధిపై ఎంత వరకు ఉంటుందోనని ఆందోళనగా ఉంది. వృద్ధి ఆందోళనల వలన రేట్ల కోతకు అధిక అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి సంబంధించిన ద్రవ్యవిధానాలకు కొంత పరిమితులున్నాయి. అందువలన ఈ విధానాలు భారీగా వృద్ధిని లేపకపోవచ్చు. సమీపకాలంలో వృద్ధి పంజుకోడానికి రంగాల వారిగా చర్యలను తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం ఖర్చులను పెంచడం వేగవంతమైన చర్య. 

జోసెప్‌ థామస్‌, హెడ్‌ రీసెర్చ్‌, ఎమ్కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌
దేశ జీడీపీ క్యూ2 లో 4.50 శాతంగా నమోదవ్వడం, వ్యవస్థలో ఆర్ధిక పనీతీరు మందగించిందనే సంకేతాన్నిస్తున్నాయి. క్యూ1లో నమోదైన 5 శాతం కంటే తగ్గడం గమనార్హం. ఫలితంగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పతనాన్ని అపాలంటే ప్రభుత్వం తక్షణమే ఆర్థిక ఉద్దీపన చర్యలను తీసుకోవాలి. వ్యవస్థలో డిమాండ్‌ తిరిగి పుం‍జుకునేందుకు చర్యలు తీసుకోవడం అవసరం. 

సునీల్‌ సిన్హా, ప్రధాన ఆర్థిక వేత్త, ఇండియా రేటింగ్స్‌
క్యూ2లో నమోదైన 4.5 శాతం జీడీపీ వృద్ధి రేటు, మేము అంచనావేసిన 4.7 శాతానికి దగ్గర్లో ఉంది. అంతేకాకుండా వ్యవస్థలో వినియోగం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పడిపోవడం వంటి కారణాల వలన జీడీపీ వృద్ధి మందగించిందని అంచనావేస్తున్నాం. ప్రభుత్వ ఖర్చుల వృద్ధి ఆర్థిక సంవత్సరం క్యూ2లో మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా స్థూల నిర్థిష్ట మూలధన నమూనా ద్వారా లెక్కించే పెట్టుబడులు, గత రెండు త్రైమాసికాల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇది మరోసారి కేవలం 1 శాతంగానే నమోదైంది. ఇది ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పడపోతుందని, దీని నుంచి బయటకు రావడం సులభం కాదనే విషయాన్ని తెలుపుతోంది. అందువలన ప్రస్తుతం ఉన్న దేశీయ, విదేశీ పరిస్థితులలో వృద్ధి పుంజుకోడానికి ప్రభుత్వం భారీ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో వచ్చే నెలలో ఆర్‌బీఐ మరో 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనావేస్తున్నాం.

అంబరీష్‌ బలిగా, స్వతంత్ర విశ్లేషకులు
గత కొన్ని సెషన్ల నుంచి మార్కెట్లు వేసిన అంచనాలకు అనుగుణంగానే జీడీపీ డేటా ఉంది. దీని ప్రభావం సోమవారం మార్కెట్లో కనిపిస్తుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్లేషకులు ప్రస్తుతం అంచనావేస్తున్నారు. 

యోగేష్‌ మెహతా, వ్యవస్థాపకుడు, ఈల్డ్‌ మాక్సిమైజర్‌
క్యూ2లో నమోదైన 4.5 శాతం జీడీపీ వృద్ధి రేటు, 4.3 శాతం జీవీఏ(గ్రాస్‌ వాల్యు యాడెడ్‌) అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆటో కంపెనీలు ప్లాంట్‌లను మూసివేయడం, వర్షాకాలం దీర్ఘంగా కొనసాగడం వంటి అంశాలు , ఆర్థిక వృద్ధి పడిపోడానికి కారణంగా ఉన్నాయి. క్యూ3, క్యూ4 లో వృద్ధి మెరుగుపడుతుందని అంచనావేస్తున్నాం.You may be interested

43 పాయింట్లు నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 30th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. శుక్రవారం నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 12099.85తో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో 12,056.00 వద్ద స్థిరపడింది.  వాణిజ్య చర్చల ఒప్పందంపై అనుమానాలు రెకెత్తడంతోపాటు జీడీపీ డేటాపై అంచనాలతో క్రితం రోజు నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభం నుండి దిద్దుబాటుకు లోనుకావడంతో12,050 స్థాయి వద్ద ముగిసింది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...ఇక్కడి నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో అనుసంధానమై ట్రేడవుతుంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి క్షీణించడం, మన మార్కెట్‌ ముగిసిన తర్వాత

పావు శాతం రేట్‌ కట్‌ పక్కా?!

Saturday 30th November 2019

నిపుణుల అంచనా డిసెంబర్‌ 3-5న జరిగే సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లను తగ్గించవచ్చని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క ద్రవ్యోల్బణం పెరగడం, మరోపక్క ఎకానమీలో మందగమనం... ఆర్‌బీఐకి విషమ పరీక్షగా మారతాయని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ది అంచనాలను ఆర్‌బీఐ స్వల్పంగా తగ్గించవచ్చన్నారు. ఈ దఫా కూడా రేట్లు తగ్గిస్తే ఏడాదిలో ఆరు మార్లు ఆర్‌బీఐ రేట్ల కోత విధించినట్లవుతుంది. అంతేకాకుండా వరుసగా ఎక్కువమార్లు రేట్లు తగ్గించిన

Most from this category