News


గార్డెన్‌ రీచ్‌ పతనం- థైరోకేర్‌ జూమ్‌

Monday 3rd February 2020
Markets_main1580705026.png-31461

క్యూ3 ఫలితాల ప్రభావం
12 శాతం పడిన గార్డెన్‌ రీచ్‌
4 శాతం జంప్‌చేసిన థైరోకేర్‌

ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నప్పటికీ తిరిగి డీలాపడ్డాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా కదులుతున్నాయి. ఉదయం 9.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 18 పాయింట్లు క్షీణించి 39,717కు చేరగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,676 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ రంగ కంపెనీ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోగా.. హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్‌ సేవల కంపెనీ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ భారీ నష్టాలతో డీలాపడగా.. థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీఎస్‌యూ..  గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 29.5 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 24 శాతం వెనకడుగుతో రూ. 370 కోట్లకు చేరింది. రూ. 1.2 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 41 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ షేరు 12 శాతం కుప్పకూలి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 164 దిగువకు పతనమైంది.

థైరోకేర్‌ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో హెల్త్‌కేర్‌ రంగ సం‍స్థ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 27.5 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పుంజుకుని రూ. 106 కోట్లకు చేరింది. ఈ కాలంలో 23 శాతం వృద్ధితో రూ. 44 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇబిటా మార్జిన్లు 37 శాతం నుంచి 41.4 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 558 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 569 వరకూ ఎగసింది.



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Monday 3rd February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం షేర్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా: జీఎస్‌కే ఫార్మా, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, హడ్కో, ఎంఆర్‌పీఎల్‌, షాల్బీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, టాటా కెమికల్స్‌ మొదలైన కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: పారిశ్రామిక వర్గాలు వెల్లడించిన వివరాలకు మేరకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ ఒడిషాలోని నారాయణ్‌ పోషి కంపెనీకి సంబంధించిన 980

ఏప్రిల్‌కు ముందే డివిడెండ్స్‌ పండుగ?!

Monday 3rd February 2020

అధిక ప్రమోటర్‌ హోల్డింగ్స్‌ ఉన్న కంపెనీలు మార్చి- ఏప్రిల్‌లోపు భారీగా మధ్యంతర డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని బడ్జెట్లో సవరించినందున అంతకుముందే భారీ డివిడెండ్లు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం కంపెనీల షేర్‌హోల్డర్లు దేశీయ కంపెనీల నుంచి పొందే డివిడెండ్‌

Most from this category