News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 11th July 2019
Markets_main1562816095.png-26963

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌....వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్ల సానుకూలత ఫలితంగా భారత్‌ సూచీలు బుధవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  194 పాయింట్ల లాభంతో 38,750  పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,562 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

ఆసియా మార్కెట్లు పాజిటివ్‌

ట్రేడ్‌వార్‌ కారణంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తున్నదని, ఇందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటామంటూ  జెరోమ్‌ పొవెల్‌ వడ్డీ రేట్లు తగ్గింపు సంకేతాల్ని వెల్లడించారు. దాంతో గత రాత్రి అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగియగా,  తాజాగా ఆసియా మార్కెట్లు  లాభపడ్డాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.3 శాతం లాభాలతో  ట్రేడవుతుండగా, జపాన్‌ నికాయ్‌ చైనా షాంఘై,   కొరియా కోస్పి,  సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌ స్వల్ప లాభాలతో కదులుతున్నాయి.  గత రాత్రి అమెరికాలో టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 1 శాతం పెరగ్గా, డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ500 సూచీలు 0.4 శాతం వరకూ పెరిగాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Thursday 11th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  స‌న్ ఫార్మా:- రైస్ డ్రోనేట్ సోడియం ఔష‌ధాల‌ను యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు ద‌క్కించుకుంది. అర‌బిందో ఫార్మా:- అమెరికా మార్కెట్లో సెన్సిప‌ర్ ఔష‌ధాల‌ను ఆవిష్కరించింది.  పిరమిల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. గ్రేవీస్ కాట‌న్‌:- ఆంపియర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అదనంగా 15 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో తన మొత్తం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు అప్‌

Thursday 11th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌....వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్ల సానుకూలత ఫలితంగా భారత్‌ సూచీలు బుధవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.55 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,542 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,492

Most from this category