News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 10th October 2019
news_main1570679048.png-28792

గత ట్రేడింగ్‌ సెషన్లో పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు...గురువారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 38,055 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 .పాయింట్ల తగ్గుదలతో 11,280 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. యస్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు 2 శాతం వరకూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5 శాతం జంప్‌చేసి రూ. 380 వద్దకు చేరింది. గ్రాసిమ్‌ 3.5 శాతం పెరగ్గా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతం, ఇన్‌ఫ్రాటెల్‌ 2 శాతం చొప్పున పెరిగాయి.



You may be interested

కస్టమర్లకు జియో షాక్‌..

Thursday 10th October 2019

- ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేస్తే ఇకపై చార్జీల విధింపు - నిమిషానికి ఆరు పైసలు వడ్డన - కాల్ టెర్మినేషన్ నిబంధనలే కారణమంటూ వివరణ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది.

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

Thursday 10th October 2019

- పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ - ఇకపై 3.25 శాతమే - రూ. 1 లక్ష లోపు బ్యాలెన్స్‌కు వర్తింపు - నవంబర్ 1 నుంచి అమల్లోకి - రుణాలపైనా వడ్డీ రేటు స్వల్పంగా తగ్గింపు ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. 1 లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును

Most from this category