News


సెన్సెక్స్‌ 265 పాయింట్ల గ్యాప్‌అప్‌

Friday 24th May 2019
Markets_main1558669439.png-25900

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో క్రితం రోజు తొలుత కొత్త రికార్డులు నెలకొల్పి, అటుతర్వాత లాభాల స్వీకరణతో తగ్గిన స్టాక్‌ సూచీలు శుక్రవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 265 పాయింట్లు గ్యాప్‌అప్‌తో 39,075 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,750 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధరలు తగ్గడంతో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు బీపీసీఎల్‌, ఐఓసీలు 2-3 శాతం ప్రారంభంలో జంప్‌చేశాయి. యస్‌బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ట్రేడింగ్‌ ప్రారంభంలో పెరిగాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీలు 1 శాతం మేర క్షీణించాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 24th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సిప్లా:- ఏఎంపీ సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 26శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఓమ్‌ మెటల్స్‌ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌:- ప్యాకింగ్‌ విభాగాన్ని విక్రయించింది.  రాడికో ఖైతాన్‌:- గతంలో ఉత్తరప్రదేశ్‌ యూనిట్‌కు ఆదేశించిన మూసివేత ఆర్డర్లను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎత్తివేసింది.  హిందూస్థాన్‌ కాపర్‌:- మే 28న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ  రుణ సేకరణ మొత్తాన్ని పెంపుతో పాటు, షేర్‌ హోల్డర్లకు సెక్యూరిటీల జారీ,

రికార్డుస్థాయి వద్ద లాభాల స్వీకరణ..నష్టాల ముగింపు

Thursday 23rd May 2019

299 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  11700 వద్ద కింద ముగిసిన నిఫ్టీ ముంబై: సూచీలు చారిత్మాక గరిష్టానికి తాకిన నేపథ్యంలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 299 పాయింట్ల నష్టంతో 38,811.39 వద్ద, నిఫ్టీ 80.85 పాయింట్లు క్షీణించి 11,657.05 వద్ద స్థిరపడ్డాయి. వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో పాటు, అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఎఫ్‌ఎంజీసీ,

Most from this category