News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌

Thursday 23rd May 2019
Markets_main1558583006.png-25892

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న కారణంగా గురువారం స్టాక్‌ సూచీలు భారీగ్యాప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 482 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డుస్థాయి 39,591 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 163 పాయింట్ల గ్యాప్‌అప్‌తో చరిత్రాత్మక గరిష్టస్థాయి 11,900 పాయింట్లపైన ప్రారంభమయ్యింది. 

కొత్త రికార్డుస్థాయికి ఎస్‌బీఐ

ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ట్రేడింగ్‌ ప్రారంభంలో 5 శాతం జంప్‌చేసి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 355 వద్ద మొదలయ్యింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 6 శాతం, ఎల్‌ అండ్‌ టీ 3 శాతం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, జీ టెలిఫిల్మ్‌లు 4 శాతం చొప్పున జంప్‌చేశాయి. మరోవైపు వేదాంత, ఓఎన్‌జీసీ, హిందాల్కోలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 



You may be interested

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే 12వేలకు నిఫ్టీ

Thursday 23rd May 2019

దేశీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే ఇప్పటివరకు వస్తున్న ఫలితాలు ఉన్నాయి. పోల్‌ నిపుణులు ఊహించినట్లు ఎన్‌డీఏ బంపర్‌ మెజార్టీ సాధిస్తే నిఫ్టీ ఈ రోజే 12వేల పాయింట్లను తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి అంచనాకు తగ్గట్లే నిఫ్టీ దాదాపు 11960 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ గత నిరోధం 11856ను దాటడం పాజిటివ్‌ పరిణామమని, అందువల్ల 12వేల పాయింట్లకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని

మోదీ హయాంలో టాటా, అంబానీ, అదానీ స్టాక్స్‌?

Wednesday 22nd May 2019

మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రముఖ పారిశ్రామిక గ్రూపులకు చెందిన కంపెనీల పనితీరు యూపీఏ-2తో పోలిస్తే మిశ్రమంగానే ఉంది. యూపీఏ-2, మోదీ ఐదేళ్ల పాలన అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకుల విధానాల పరంగా భిన్నమైనవి. యూపీఏ-2లో వర్ధమాన మార్కెట్లకు నిధులు వెల్లువెత్తగా, మోదీ సర్కారు సమయంలో పరిస్థితి మరో విధంగా ఉంది.    ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపు సంపద మాత్రం మోదీ హయాంలో గణనీయంగా వృద్ధి చెందింది. యూపీఏ-2 పాలనలో రూ.11,684

Most from this category