News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 26th June 2019
Markets_main1561520269.png-26571

వడ్డీ రేట్ల కోతపై అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ నీళ్లుచల్లడంతో ప్రపంచ సూచీలు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56  పాయింట్ల తగ్గుదలతో 39,371 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల క్షీణతతో 11,768 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌లు 1-2 శాతం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, సిప్లాలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.  వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్‌ ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలగ్గొదని, అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు, అమెరికా-చైనాల వాణిజ్యపోరు తదితర అంశాల్ని సునిశితంగా గమనిస్తున్నామని, ఆయా అంశాల ప్రాతిపదికగా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటామంటూ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ ప్రకటించారు. ఫలితంగా గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1.5 శాతం వరకూ క్షీణించగా, ఈ ఉదయం ఆసియా సూచీలన్నీ స్వల్ప తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

క్షీణించిన రూపాయి

Wednesday 26th June 2019

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం(జూన్‌ 26) ట్రేడింగ్‌లో బలహీనపడి 69.40 వద్ద ప్రారంభమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గమని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పౌల్‌ అనడంతో డాలర్‌ బలపడింది. కానీ అమెరికా సుంకాలు, ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధలా వలన రేట్‌ కట్‌ తప్పనిసరిగా అవసరం అని ఆయన తెలిపారు. పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల వలన గత సెషన్‌లో రూపీ ప్లాట్‌గా 69.36 వద్ద ముగిసింది. ఫెడ్‌ వడ్డి రేట్ల కోత

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th June 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు స్పైస్ జెట్‌:- కొత్తగా ఎనిమిది నాన్-స్టాప్ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాలను లాంచ్ చేసింది.  వెల్‌స్పన్ కార్ప్‌:- అర్హత క‌లిగిన షేర్ హోల్డర్లకు డివిడెండ్‌ను జారీ చేసేందుకు జూలై 05ను రికార్డు తేదిగా నిర్ణయించింది.  ప‌నోర‌మా స్టుడియో ఇంట‌ర్నేష‌న‌ల్:- ఇండియాలో సినిమాల పంపిణి వ్యాపారం కొర‌కు పీపీఆర్ పిక్చర్స్ తో జ‌త క‌ట్టింది.  విరించి:- ఫ్రిప‌రెన్షియ‌ల్ బేసిస్ ప‌ద్ధతిలో జ‌న‌వ‌రి 06వ తేదిన జారీ చేసిన 3.40 కోట్ల

Most from this category