News


బ్రేకవుట్‌ సంకేతాలివే!

Monday 14th January 2019
Markets_main1547445342.png-23565

50, 100 డీఎంఏ మధ్య తగ్గుతున్న అంతరం
సూచీలు కొన్ని వారాలుగా స్వల్ప శ్రేణిలో కదలాడుతున్నాయి. నిఫ్టీ బ్రేకవుట్‌ ఇస్తుందా, బ్రేక్‌డవున్‌ అవుతుందా? ఇతమిద్దంగా తెలియక ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ క్రమంగా బ్రేకవుట్‌కు దగ్గరవుతోందని, ఇందుకు సంకేతాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చార్టుల్లో 50, 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ల(డీఎంఏ) మధ్య బేధం తగ్గుతూ వస్తోందని, ఇది చాలా కీలక సంకేతమని చెబుతున్నారు. గత నెలరోజుల్లో 50 డీఎంఏ స్థాయి నిఫ్టీకి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఈ లైన్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో 100 రోజుల డీఎంఏ స్థాయి నిఫ్టీకి నిరోధంగా వ్యవహరిస్తోంది. ఈ స్థాయి ఇటీవల క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో 50, 100 రోజుల డీఎంఏల మధ్య అంతరం తగ్గిపోతోంది. నిఫ్టీ ప్రస్తుత కన్సాలిడేషన్‌ దశను ఆరంభించినప్పుడు వీటి మధ్య వ్యత్యాసం 450 పాయింట్లుంది. కానీ ఇప్పుడు ఈ వ్యత్యాసం 150 పాయింట్లకు పడిపోయింది. ఇది బ్రేకవుట్‌కు సంకేతమని నిపుణుల అంచనా.
దీంతో పాటు ఏడీఎక్స్‌ ఇండికేటర్‌ కూడా పాజిటివ్‌ సంకేతాలిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత నవంబర్‌ నుంచి ఏడీఎక్స్‌ సూచి పడిపోతూ ప్రస్తుతం 16.50 స్థాయి వద్ద స్ధిరంగా కదలాడుతోంది. ఇదే సమయంలో వీఐఎక్స్‌ 15- 16.5 రేంజ్‌లోనే కదలాడుతోంది. క్రమంగా వీఐఎక్స్‌ ట్రేడింగ్‌ రేంజ్‌ సైతం తగ్గుతోంది. ఇవన్నీ ఒకటి రెండు వారాల్లో బ్రేకవుట్‌ను సూచిస్తున్నాయి. నిఫ్టీకి 10710 పాయింట్ల వద్ద మద్దతు, 10870 పాయింట్ల వద్ద నిరోధం ఉన్నాయి. బ్రేకవుట్‌ వస్తే నిఫ్టీ తక్షణ టార్గెట్‌ 11,000 పాయింట్ల వరకు ఉండొచ్చు. దిగువన బ్రేక్‌డవున్‌ వస్తే 10500 పాయింట్ల వద్ద మద్దతు దొరకవచ్చు. ట్రేడర్లు కచ్ఛితమైన ఫలితం చూసిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేకవుట్‌ లేదా బ్రేక్‌డవున్‌ను పరిశీలించేందుకు ఆర్‌ఎస్‌ఐ లాంటి ఇతర ఇండికేటర్లను కూడా చూస్తుండాలని సలహా ఇస్తున్నారు. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Monday 14th January 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,292.15 వద్ద ట్రేడ్‌ అవుతుంది. చైనా విడుదల చేసిన డిసెంబర్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు రెండేళ్ల కనిష్టస్థాయిలో నమోదు కావడం, ముడిచమురు ధరల పెరగుదల, అమెరికా షట్‌డౌన్‌ 23వరోజూ కొనసాగుతుండటం తదితర కారణాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అస్థిరత పరిస్థితులను నెలకొల్పాయి. మరోవైపు ఈ

సోమవారం వార్తలోని షేర్లు

Monday 14th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాల ఇన్ఫోసిస్‌:- శుక్రవారం క్యూ3 ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.800ల చొప్పున మొత్తం 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ ఇష్యూ విలువ సుమారు రూ.8,260 కోట్లుగా ఉంది. అలాగే  షేరు ఒక్కింటికి రూ.4లు చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించనుంది. ఇందుకు రికార్డు

Most from this category