News


గెయిల్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Thursday 6th June 2019
Markets_main1559796923.png-26123

సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ సంస్థ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గెయిల్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌లో ఈ కంపెనీ షేరు రూ.338.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కీలక పైప్‌లైన్ల టారీఫ్‌లు నిరుత్సాహపరచడటం, ముడిచమురు ధరల అస్ధిరత, ఎల్‌ఎన్‌జీ ధరలు తగ్గుదల తదితర కారణాలతో సీఎల్‌ఎస్‌ఏ గతంలో షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘అవుట్‌ ఫెర్మ్‌ఫామ్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరు టార్గెట్‌ ధర రూ.420 నుంచి రూ.365లకు పరిమితం చేసింది. రేటింగ్‌ సం‍స్థ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు షేరు అమ్మకానికి మొగ్గుచూపారు. ఫలితంగా షేరు  10శాతం పతనమైన రూ. 323.55ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.10:00లకు షేరు గత ముగింపు ధర(రూ.358.5)తో పోలిస్తే రూ.9.50శాతం నష్టంతో రూ.323.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 296.00  రూ.398.80లుగా నమోదయ్యాయి. 
ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టపోయి 39974.54 వద్ద, నిఫ్టీ 53.45 పాయింట్లు నష్టపోయి 11968.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రెలిగేర్‌ షార్ట్‌టర్మ్‌ రికమండేషన్లు

Thursday 6th June 2019

స్వల్పకాలంలో 5- 10 శాతం రాబడినిచ్చే మూడు స్టాకులను రెలిగేర్‌ రికమండ్‌ చేస్తోంది.  1. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 394.  2. సీఈఎస్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 820. స్టాప్‌లాస్‌ రూ. 738. 3. ఏసీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1825. స్టాప్‌లాస్‌ రూ. 1670.  గురువారం ట్రేడింగ్‌లో సూచీలు దాదాపు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ పాలసీ సమావేశ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈదఫా ఆర్‌బీఐ

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 6th June 2019

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ రూ.156 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.  విప్రో:- ఇంటర్నేషనల్‌ టెక్నోగ్రూప్‌ను చేజిక్కించుకునేందుకు కంపెనీ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అవెన్యూ సూపర్‌మార్ట్‌:- జూన్‌ 4వ తేదిన కంపెనీ రూ.100 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది.  యాక్సిస్‌ బ్యాంక్‌:- ధీర్ఘకాలిక ఇష్యూయర్‌ డిఫార్ట్‌ రేటింగ్‌ను ఎఎఎఎ(-) నుంచి ఎఎ(+)కి సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఫిచ్‌ రేటింగ్స్‌...బ్యాంకు బాండ్లకు

Most from this category