News


ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు అంతంతమాత్రమే

Wednesday 26th June 2019
Markets_main1561632487.png-26597

  • స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీలు రాణించే అవకాశం
  • పార్మారంగంలో కాంప్లెక్స్‌ జనరిక్‌ రాణించగలదు
  • ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌కు లాభం 


2020 ఆర్థిక సంవత్సరం ద్వితియార్థం కంటే ప్రథమార్ధంలోనే అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని, కానీ ఆర్థిక సంస్కరణలు దీనిని మార్చవచ్చని ప్రిన్సిపల్‌ ఏఎమ్‌సీ సీఐఓ రజత్‌ జైన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. పూర్తి ఇంటర్యూ ఆయన మాటల్లోనే..

బడ్జెట్‌ పాలసీపై ఇన్వెస్టర్ల దృష్ఠి..
    ఈ ఏడాది మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయ వాతావారణ పరిస్థితులు, వృద్ధి మందగమనం, మరో పది రోజులలో ప్రవేశపెట్టబోతున్న యూనియన్‌ బడ్జెట్‌ వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటితో పాటు ఆదాయం తగ్గుదల వలన ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. గత ఏడాది ప్రత్యేక్ష, పరోక్ష పన్నుల వృద్ధి మందగించింది. అంతేకాకుండా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వం కొత్తగా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడంతో ఖర్చులు పెరగడం వంటివి సమస్యలుగా పరిణమించాయి. ద్యవ్యలోటు లక్ష్యాన్ని దాటితే అది తయారి​రంగ సామర్ధ్యంపై ప్రభావం చూపుతుంది.  బడ్జెట్‌ ఎటువంటి పాలసీని అనుసరించనుందో ఇన్వెస్టర్లు దృష్ఠి సారించనున్నారు. ఇందులో మౌలిక రంగానికి, రోడ్లు, ఇళ్లకు అధికంగా కేటాయింపులు జరుగుతాయని అంచానాలున్నాయి. దీనికితోడు ఆవాస్‌ యోజన పథకం గురించి నిన్న మంత్రి మాట్లాడారు. ఇవన్ని ప్రభుత్వం ఎటువంటి పాలసీని సిద్ధం చేసిందో అంచనా వేయడానికి మార్కెట్లకు అవకాశాన్ని ఇస్తున్నాయి. బడ్జెట్‌ వెలువడ్డాక సంపాదనలు పెరిగే అవకాశం ఉంది. కార్పోరేట్‌ బ్యాంక్‌లు 2020 ఆర్ధిక సంవత్సరం సంపాదనలో ముందుండే అవకాశం ఉంది. పెరుగుతున్న ఆయిల్‌ ధరలు, దేశియ ఆర్థిక పరిస్థితి, అనిశ్చితి కారణంగా 2020 ఆర్ధక సంత్సరం ఈక్విటీ మార్కెట్లకు గొప్పగా ఉండకపోవచ్చు. 

  ఆర్థిక సంస్కరణులంటే మార్పుంటుంది...
  ప్రభుత్వం అధికంగా మూలధన వ్యయాన్ని మౌలిక రంగం, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు, రోడ్లు, రైలు మార్గలకై వినియోగిస్తోంది. కానీ మెటల్స్‌ లేదా పవర్‌ ఉత్పత్తి సామర్ద్యాలపై అంత ఎక్కువగా వెచ్చించడం​లేదు. ఈ ఏడాది ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి ఎక్కువ మొత్తంలో మూల ధనం వచ్చేట్టు కనిపించడం లేదు. గత రెండు నుంచి మూడు త్రైమాసికాలను గమనిస్తే ఇండస్ట్రీయల్‌ క్యాపిటల్‌ గూడ్స్‌కు డిమాండ్‌ పెరిగిన 2020 ఆర్థిక సంవత్సరంలో తిరిగి పుంజుకునే అవకాశం తక్కువగానే ఉంది. నా అంచనా ప్రకారం ఈ ఏడాది రెండవ భాగం కంటే మొదటి భాగంలోనే అధిక లాభాలొస్తాయి. కానీ బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణలకు ప్రభుత్వం మొగ్గు చూపితే వీదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్‌ఐఐ), ఎఫ్‌పీఐలు అధికంగా రావచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థను నడిపించే చాలా రంగాలు మందగమనంలో ఉండడం కూడా గమనించాలి. 

బ్యాంకింగ్‌, సిమెంట్‌, సేవారంగం, ఎఫ్‌ఎమ్‌సీజీ..
ఎన్‌బీఎఫ్‌సీ రంగం పోటి గణనీయంగా తగ్గుతోంది. అందువలన బ్యాంకింగ్‌ సెక్టార్‌ లాభపడే అవకాశం ఉంది. మనకు బలమైన కార్పోరేట్‌ బ్యాంక్‌లు తక్కువ నష్టాలతో ఉన్నాయి. పెద్ద పెద్ద బ్యాంకులకు మూలధనం సులువుగా లభిస్తుంది. పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు క్యాపిటల్‌ను పెంచుకోగలవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటికిది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాయో చూడాలి. ఇంకో వైపు చూస్తే సిమెంట్‌. ఇది అతిపెద్ద సెక్టార్‌ కాకపోయినప్పటికి 4-4.5 శాతం వరకు మార్కెట్‌లో విస్తరించి ఉంది. సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగితే మౌలిక రంగం, హౌసింగ్‌ రంగాలలో అభివృద్ధిని చూడవచ్చు. సిమెంట్‌ బాగా రాణించే అవకాశం ఉంది.  ఇంకోకటి సేవారంగం. ఉదాహరణకు హొటల్స్‌ను తీసుకుంటే గణనీయమైన పెరుగుదల మనకు కనిపిస్తోంది. టెలికాం రంగంలో ధరల తగ్గుదలను చూస్తున్నాం. వీటన్నిటికి లాభపడే సామర్ధ్యం ఉంది. 
       వినియోగ ఆధారిత ఉత్పత్తులలో ఎటువటింటి ఒత్తిడి లేదు. ఎఫ్‌ఎమ్‌సీజీ నిర్వహకులు కూడా ద్వితియార్దంలో మంచి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఎదోఒక సమయంలో ఈ ఉత్పత్తులు బాగా రాణించగలవు. ఈ రంగంలో వృద్ది కనిపిస్తోంది. కానీ వాల్యుషన్‌ పరంగా వీటి ఖరీదు అధికంగా ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తను వహంచడం అవసరం. కానీ వీటి వృద్ధికి అవకాశం ఉంది. 

ఈక్విటీ మార్కెట్లు రాణించే అవకాశం తక్కువ..
2020 ఆర్ధిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లు గొప్పగా రాణించే అవకాశం చాలా తక్కువ. కానీ మార్కెట్లు నష్టపోయి గొప్ప ర్యాలీలు చేసిన సందర్బాలను చూశాం. ప్రభుత్వం తీసుకునే పాలసీకి అనుగుణంగా మార్కెట్లు నడుచుకునే అవకాశం ఉంది. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌లలో తక్కువ ధరలోనే లభించి బాగా రాణించగలిగే కంపెనీలున్నాయి.  మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసే వాళ్లకే ఇదొక గొప్ప అవకాశం.
     ఎఫ్‌డీఏ హెచ్చరికల వలన పార్మా రంగంలో ఇన్వెస్ట్‌ చేయడం ప్రమాదమే కానీ కొన్ని సెలక్టడ్‌ కంపెనీలు బలంగానే ఉన్నాయి. కాంప్లెక్స్‌ జనరిక్‌ మెడిసిన్‌లను ఉత్పత్తి చేసే కంపెనీలకు పార్మా రంగంలో అవకాశం ఉంది. కాంప్లెక్స్‌ జనరిక్‌ మెడిసిన్‌ను అందించే పెద్ద, మధ్యస్థ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

మార్కెట్లు మారతాయి..
  మార్కెట్‌ స్థిరంగా ఉండవు. తీవ్రంగా నష్టపోవడమో లేదా లాభపడడమో మనం చాలా సార్లు చూశాం. హెడ్‌లైన్‌లు బట్టి మార్కెట్‌లు ప్రవర్తిస్తూ ఉంటాయి.  ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఆటో రంగంలో వృద్ధి మందగమనం కూడా అలాంటిదే. ఎదో ఒక సమయంలో మార్కెట్లు తిరిగి విలువను పొందుతాయి. కానీ అలాంటి సమయం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. బహుశ ఎన్‌బీఎఫ్‌సీల్లో తాజా సంఘటనలు వంటివి లేకపోయినప్పుడు అవ్వోచ్చు . ఇప్పుటికిప్పుడయితే ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన ఈ రంగంలోని  మొత్తం కంపెనీలు నష్టాలలో ఉన్నాయి. కాలం వెళ్లే కొద్ది మార్కెట్లలో మార్పు వస్తుంది. అది ఎప్పుడా అనేది నాకు తెలియదు.You may be interested

ఎడెల్‌వీజ్‌, పిరమల్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌.. ఏం సంకేతం?

Thursday 27th June 2019

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజాగా ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దీర్ఘకాలిక రేటింగ్‌లను (డౌన్‌గ్రేడ్‌) తగ్గించింది. ఈ సంస్థల హోల్‌సేల్‌ రియల్‌ ఎస్టేట్‌ రుణాల పుస్తకంలో అధిక డిఫాల్ట్‌లకు అవకాశం ఉండడంతో ఈ పనిచేసింది. ఆర్థిక రంగ మందగమనం కూడా ఈ పరిస్థితులకు కారణం. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ హోల్‌సేల్‌ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు రెండు విధాలుగా కష్టాలు వచ్చిపడినట్టు అయింది. ఒకవైపు తమ రుణ ఆస్తుల్లో

జలాన్‌ కమిటీతో పనిలేకుండానే రీక్యాప్‌?!

Wednesday 26th June 2019

బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను కేంద్రానికి ఇచ్చి అటు నుంచి పీఎస్‌యూ బ్యాంకులకు రీక్యాప్‌ చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే జలాన్‌ కమిటీ నివేదిక వాయిద పడిన సందర్భంలో దీనికోసం వేచిచూడకుండా బడ్జెట్లో కొంత మొత్తాన్ని పీఎస్‌బీల రీక్యాప్‌కు అందించాలని కొత్త విత్తమంత్రి భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో పీఎస్‌బీల రీక్యాప్‌ కోసం 35-40 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎకానమీలో క్రెడిట్‌

Most from this category