News


నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ .. 12,620

Friday 7th September 2018
Markets_main1536311467.png-20057

2019, 2020 ఆర్థిక సంవత్సరాల ఈపీఎస్‌ అంచనాల ఆధారంగా చూస్తే నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ 12,620 అని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు మార్కెట్లకు రిస్క్‌ అని పేర్కొన్నారు. అలాగే ఈ అంశాలు కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదలకు కారణమౌతాయని తెలిపారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై త్రీవ ప్రభావం పడుతుందని, ఆర్థిక సమతౌల్యత దెబ్బతింటుందుని పేర్కొన్నారు. 
ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే వర్ధమాన మార్కెట్లలో నిఫ్టీ ఇండెక్స్‌ ఉత్తమ పనితీరు కనబర్చిందని శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ప్రస్తుత బుల్‌ మార్కెట్‌ కన్నా ముందటి పరిస్థితులను గమనిస్తే.. నిఫ్టీ సైక్లికల్‌గా గరిష్టాన్ని స్థాయిని తాకిందని, వచ్చే 12 క్వార్టర్ల ఎర్నింగ్స్‌కు 24 రెట్లు వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎర్నింగ్స్‌కు 18 రెట్లు వద్ద బాటమ్‌ను ఏర్పరచిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. నిఫ్టీ తక్షణ ట్రేడింగ్‌ రేంజ్‌ 10,980-12,089గా ఉందని పేర్కొన్నారు. ఎర్నింగ్స్‌ ఆధారంగా ప్రతి క్వార్టర్‌లో లోనూ ఈ రేంజ్‌ను కొద్దిగా పైకి సవరించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం 2019, 2020 ఆర్థిక సంవత్సరాల ఈపీఎస్‌ అంచనాల ఆధారంగా చూస్తే నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ 12,620 అని పేర్కొన్నారు. 
దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగటం, ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృతం చెందటం, బలమైన వినియోగం, ఎర్నింగ్స్‌ పుంజుకోవడం వంటి అంశాలు స్టాక్‌ మార్కెట్లకు బలానిచ్చాయని శైలేంద్ర కుమార్‌ తెలిపారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత రిస్క్‌ అంశాలని పేర్కొన్నారు. ఇటీవలనే బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల కూడా ప్రతికూలమని తెలిపారు. దీనివల్ల ఎర్నింగ్స్‌, వ్యాల్యుయేషన్స్‌ తగ్గే ప్రముదముందని పేర్కొన్నారు. ఇండియన్‌ ఎకానమీకి 7 శాతం వృద్ధి కొనసాగింపు మంచిదేనని తెలిపారు. డీమోనిటైజేషన్‌, జీఎస్‌టీ అమలు వల్ల వృద్ధి 7 శాతానికి దిగువకు పడిపోయిందని గుర్తుచేశారు. 2019 ఆర్థిక సంవత్సరపు జీడీపీ 7.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
గత ఐదేళ్లుగా చూస్తే రూపాయి 63-68 రేంజ్‌లో కదలాడిందని శైలేంద్ర కుమార్‌ తెలిపారు. అందువల్ల రూపాయిలో కొంత క్షీణత ఫండమెంటల్‌గా చూస్తే సబబుగానే అనిపిస్తుందని పేర్కొన్నారు. ఇతర కరెన్సీలు, ద్రవ్యోల్బణం కోణంలో కూడా రూపాయి తగ్గుదల సరైనదేనని అభిప్రాయపడ్డారు. భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు కలిగిన దేశం కావడం వల్ల రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగిందన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 69-74 శ్రేణిలో స్థిరపడొచ్చని అంచనా వేశారు. క్రూడ్‌ ధరలు సమీప కాలంలో మార్కెట్లకు అతిపెద్ద రిస్క్‌ అంశమని తెలిపారు. 
రిటైల్‌ రుణాలందించే సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని శైలేంద్ర కుమార్‌ తెలిపారు. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి వాటిని ఉదాహరణగా పేర్కొన్నారు. కార్పొరేట్‌ రుణాలందించే సంస్థలు మంచి పనితీరు కనబర్చడం లేదన్నారు. అయితే యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇతర పీఎస్‌యూ బ్యాంకుల్లో వృద్ధి ఆలస్యంగా మొదలైందని పేర్కొన్నారు. రిటైల్‌ రుణాలు అందించే సంస్థలు రానున్న రోజుల్లోనూ మంచి పనితీరు కనబరుస్తాయని అంచనా వేశారు. అయితే నాణ్యమైన కార్పొరేట్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ను కూడా ఎంచుకోవచ్చని సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్‌ చక్రం పుంజుకోవడం, ఎన్‌పీఏలు ఇక ఇంతకన్నా ఎక్కువ స్థాయికి పెరగవనే అంచనాలు వల్ల కార్పొరేట్‌ బ్యాంకుల ఎర్నింగ్స్‌ పెరగొచ్చని తెలిపారు. 
2015-17 ఆర్థిక సంవత్సరాల్లో ఫార్మా, ఐటీ రంగాలు మంచి పనితీరు కనబర్చలేదని శైలేంద్ర కుమార్‌ గుర్తుచేశారు. అమెరికాలో ప్రతికూల పరిస్థితులను ఇందకు కారణంగా పేర్కొన్నారు. అయితే 2018 నుంచి అక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. రూపాయి పడిపోవడంతో కంపెనీల మార్జిన్లు పెరిగాయని తెలిపారు. అయితే కొన్ని ఫార్మా స్టాక్స్‌లో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 
 You may be interested

నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Friday 7th September 2018

2శాతం నష్టపోయిన ఎస్‌బీఐ షేరు మిడ్‌సెషన్‌ సమయానికి స్తబ్దుగా ట్రేడ్‌ సాగుతున్న మార్కెట్‌ ర్యాలీలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వ రంగ షేర్లకి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఇంట్రాడేలో అత్యధికంగా 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (3161)తో పోలిస్తే 1.21శాతం నష్టంతో 3,124.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈసూచీలోని మొత్తం 11 షేర్లకు

అటో షేర్ల ర్యాలీ..!

Friday 7th September 2018

ముంబై:- అటో షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో స్పీడుగా ర్యాలీ చేస్తున్నాయి. అటో షేర్ల ర్యాలీతోనే నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సూచీలు తిరిగి లాభాల బాటపట్టాయి. బజాజ్‌ అటో, టాటా మోటర్స్‌ షేర్ల ర్యాలీ అండతో ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.16శాతం లాభపడింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.06 శాతం లాభంతో 10,913 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ

Most from this category