News


ఆల్‌టైమ్‌ కనిష్టానికి 14 స్టాక్‌లు

Thursday 26th March 2020
Markets_main1585219660.png-32694

బీఎస్‌ఈ500 ఇండెక్స్‌లో గురువారం 14 స్టాక్‌లు ఆల్‌టైమ్‌ కనిష్టానికి చేరాయి. దీనిలో ఫ్యూచర్‌ రిటైల్, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్, జస్ట్‌ డయిల్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, డిష్‌ టీవీ నెట్‌వర్క్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్, శంకరా బిల్డింగ్‌ ప్రోడక్ట్స్, వరోక్‌ ఇంజనీరింగ్‌ షేర్లు ఉన్నాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లు 5 శాతం పతనమై రూ.91.75 వద్ద వరుసగా 11 రోజు లోవర్‌ సర్క్యూట్‌ను తాకాయి.  ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌ ద్వారా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌(ఎన్‌సీడీఎస్‌) రుణాలు ఇచ్చిన రుణదాతలు ప్రమోటర్లకు చెందిన 42.2 మిలియన్లు 8శాతం వాటాకు సమానమైన షేర్లను తీసుకున్నారని కంపెనీ గురువారం ప్రకటించడంతో ఈ షేర్లు కనిష్టానికి పడపోయాయి. గత ఆరు వారాలుగా ఫ్యూచర్‌ రిటైల్‌ స్టాక్‌ ధర 76 శాతానికి చేరి రూ.377 స్థాయికి చేరింది. ఇక ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 5 శాతం పడిపోయి రూ.36.85 కు చేరింది. రూ.500 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేసేప్రక్రియను మొదలు పెట్టామని  ప్రకటించడంతో షేర్లు కనిష్టానికి పడిపోయాయి. గత నెలలో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేరు 54 శాతానికి పెరిగాయి. శంకర బిల్డింగ్స్‌ ప్రోడక్ట్స్‌ 5 శాతం పడిపోయి రూ.232 కు చేరాయి. 



You may be interested

మూడో రోజూ ముచ్చట- మార్కెట్‌ జూమ్‌

Thursday 26th March 2020

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ దన్ను మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం అప్‌ సెన్సెక్స్‌ 1411 పాయింట్లు హైజంప్‌ 324 పాయింట్లు ఎగసిన నిఫ్టీ ఇండస్‌ఇండ్‌ 46 శాతం దూకుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు మరోసారి జోరు చూపాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌  1411 పాయింట్లు దూసుకెళ్లి 29,947 వద్ద నిలవగా.. నిఫ్టీ 324 పాయింట్లు జంప్‌చేసింది.

త్వరలో రూ.45000 స్థాయికి బంగారం ధర

Thursday 26th March 2020

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండడంతో ఇండియాలో 10 గ్రాముల పసిడి రూ.45,000 స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, సావర్జీన్‌ గోల్డ్‌ బాండ్స్‌(ఎస్‌జీబీ) కలిగి ఉన్న వారికి ఈ పరిమాణం లాభం చేకూరుస్తుందని అంతర్జాతీయ మార్కెట్‌ కేడియా సలహాదారు అజయ్‌ కేడియా వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఇండియన్‌ బులియన్‌ జువెల్లర్స్‌ షాపులు మూసేసారు.  దీంతో బుధవారం దేశీయ

Most from this category