News


సీఎఫ్‌ఓ అరెస్ట్‌: ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 13శాతం పతనం

Monday 15th July 2019
Markets_main1563186798.png-27075

కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసుర్‌ అరెస్ట్‌ కావడంతో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 13శాతం పతనమయ్యాయి. రూ.14.58 కోట్ల కస్టమ్స్‌ పన్ను ఎగవేత కేసులో ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు సేవలందిస్తున్న దినేశ్ మహేశ్వరీని శనివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి రెడిమేడ్ దుస్తులను దిగుమతి చేసుకున్న ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్.. కనీస కస్టమ్స్ పన్ను చెల్లించకుండా పెట్రోపోల్ లాండ్ కస్టమ్స్ స్టేషన్ (ఎల్‌సీఎస్) ద్వారా దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత (ఎస్‌ఏఎఫ్‌టీఏ) ప్రయోజనాలను పొందింది. సుంకం ఎగవేతకు దినేశ్‌ ప్రధాన బాధ్యుడని ఏజెన్సీ ఆరోపించింది. కస్టమ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 104 కింద ఆయ న్ను అరెస్ట్‌ చేసినట్లు డీఆర్‌ఐ శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 13శాతం భారీ నష్టంతో రూ.29.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో కనిష్టస్థాయి నుంచి కొంత మేర రికవరి సాధించగలిగింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు ధర(రూ.34)తో పోలిస్తే 3.50శాతం నష్టంతో రూ.32.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది, కనిష్ట ధరలు వరుసగా రూ.29.00  రూ.51.00లుగా నమోదయ్యాయి.



You may be interested

చిన్నస్టాకులు కొనేందుకు ఇదే సమయమా?

Monday 15th July 2019

కొన్నాళ్లు ఆగమంటున్న నిపుణులు మార్కెట్ల ఆల్‌టైమ్‌ హైవద్ద కొనసాగేందుకు కష్టపడుతున్నాయి. మరోపక్క కొన్ని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు ర్యాలీకి రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌లో ఎంటర్‌కావడం అంతమంచిది కాదని, మరికొంతకాలం వేచిచూసి వీటిలో పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకపక్క ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు, మరోపక్క బడ్జెట్‌ ప్రతిపాదన భయాలు.. మార్కెట్‌పై భారం మోపుతున్నాయి. ఆర్థిక వృద్ధిసైతం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో

ఎలక్ట్రిక్‌ వాహనాలు..15 లక్షల ఉద్యోగాలకు ప్రమాదం

Monday 15th July 2019

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం వలన ఇందన దిగుమతి ఖర్చులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల వలన కాలుష్యాన్ని తగ్గించే విలుంటుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆటో రంగంలో ఈ సాంకేతిక మార్పు అనేక మందిపై ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావం చూపనుంది. లక్షలాది ఉద్యోగాలను కోల్పోవలసి ఉంటుంది.   ఎలక్ట్రిక్‌ వాహానాలకు మారడం వలన ఫ్యాక్టరీలలో ఇంజన్‌, ట్రాన్స్‌మిషన్‌ (పవర్‌ ట్రైన్‌) ఉద్యోగాలు   ప్రమాదంలో

Most from this category